Friday, May 3, 2024

350కోట్లు ఎక్కడ.. పేద రోగులతో పెట్టుకుంటే మీకు పుట్టగతులుండవు

spot_img

నిరుపేదలకు సహాయం అందించే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి సహాయనిధి ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదని వార్త ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెలన్నర గడిచినా ఒక్కరికంటే ఒక్కరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వలేదు. దాదాపు 80 వేల మంది పేద రోగులకు రావాల్సిన రూ.350 కోట్ల విలువైన చెక్కులను సర్కారు స్వార్ధ ప్రయోజన కోసం పంపిణీ చేయలేదు.

అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున పేద రోగులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసేది. అందుకే ప్రజలు భారీగా సహాయం కోసం వేచి ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు స్పందించటం లేదు. కేవలం తమ కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పిన వారికే చెక్కులకు పంపిణి చేయడానికి.. సామాన్య రోగులకు చెక్కులని ప్రభుత్వం నిలిపేసిందని ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. పేద రోగులకు అన్యాయం చేస్తే పుట్టగతులుండవని.. రాష్ట్రంలోని తమ కార్యకర్తల రెడీ చేసిన లిస్ట్ పూర్తయ్యాకనే చెక్కులు రిలీజ్ ఉంటుందా అని అడుగుతున్నారు.

ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు ఇవ్వకూడదని అనుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు తమ ఎమ్మెల్యేలు చెప్పిన వారికి సహాయం చేస్తే తరువాత ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వాల్సి వస్తుంది. దాంతో ఆ క్రెడిట్ వారికి వెళ్తుందని నీచ రాజకీయాలకు తెరలేపుతుంది కాంగ్రెస్. అయితే పేద రోగులకు అందాల్సిన చెక్కుల విషయంలో రాజకీయాలు ఏంటీ అని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా పెద్ద మనసుతో పేద రోగులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణి షురూ చేయాలనీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

 

Latest News

More Articles