Saturday, April 27, 2024

ధోని రికార్డును సమం చేసిన రోహిత్ శర్మ

spot_img

భారత్, అప్ఘానిస్థాన్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‎లో అద్భుత సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ.. రికార్డ్ క్రియేట్ చేశాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆల్‌టైమ్ రికార్డును హిట్‌మ్యాన్ సమం చేశాడు. మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో కెప్టెన్‌గా 42 విజయాలు అందుకున్నాడు. ధోని 72 మ్యాచ్‌ల్లో 42 విజయాలు నమోదు చేయగా.. రోహిత్ 54 మ్యాచ్‌ల్లోనే 42 విజయాలు నమోదు చేసి ఈ రికార్డ్ అందుకున్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్లుగా మొదటి స్థానంలో రోహిత్, ధోనినే ఉన్నారు. రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా మరొక విజయం సాధిస్తే 43 విజయాలతో మొదటి స్థానానికి చేరుకుంటాడు. దాంతో హిట్‌మ్యాన్ అభిమానులందరూ జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం ఎదురుచూస్తున్నారు.

Read also: తాయిత్తు కట్టిస్తానని వెళ్లి ఇద్దరు పిల్లలతో సహా అదృశ్యమైన తల్లి

భారత్, అప్ఘాన్ జట్ల మధ్య బుధవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఫుల్ మజాను పంచింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో చివరి వరకు విజయం రెండు జట్లతో దోబూచులాడింది. చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్ టై అయింది. రెండు జట్లు సమానంగా 212 పరుగులు చేయడంతో మ్యాచ్ ఫలితం కోసం అంపైర్లు సూపర్ ఓవర్‌ను నిర్వహించారు. కానీ సూపర్ ఓవర్‌లో సైతం రెండు జట్లు పట్టు వదలకుండా పోరాడాయి. చివరకు సూపర్ ఓవర్ కూడా టై అయింది. దాంతో మరోసారి అంపైర్లు సూపర్ ఓవర్‌ను నిర్వహించక తప్పలేదు. అయితే ఈ సారి నిర్వహించిన సూపర్ ఓవర్‌లో భారత్‌ను విజయం వరించింది. కెప్టెన్ రోహిత్ శర్మ భారీ హిట్టింగ్, లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ అద్భుత బౌలింగ్‌తో రెండు వికెట్లు తీయడంతో ఉత్కంఠ పోరులో భారత్ జయకేతనం ఎగురవేసింది.

Latest News

More Articles