Thursday, May 2, 2024

చిరంజీవికి పద్మవిభూషణ్.. ఆర్జీవీ సెటైర్స్

spot_img

జనవరి 24, గురువారం నాడు చిరంజీవిని పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించారు. ఈ సంవత్సరం పద్మవిభూషణ్‌తో సత్కరించిన ఐదుగురిలో చిరంజీవి కూడా ఉన్నారు. భారతరత్న తరువాత ప్రదానం చేయబడే రెండవ అత్యున్నత పౌర పురస్కారం ఇది. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

రామ్ గోపాల్ వర్మ X మాట్లాడుతూ.. “నేను శ్రీ పద్మా సుబ్రహ్మణ్యం లేదా శ్రీ బిందేశ్వర్ పాఠక్ గురించి ఎప్పుడూ వినలేదు. అలంటి వారిని మెగా స్టార్‌తో సమానమైన స్థానంలో వారిని ఉంచడానికి, నేను అస్సలు థ్రిల్‌గా లేను. అవార్డు వచ్చినందుకు చిరంజీవి గారు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా నటిస్తాను’ అని అన్నారు రామ్ గోపాల్ వర్మ.

పద్మా సుబ్రహ్మణ్యం ప్రపంచ ప్రఖ్యాతి చెందిన భారతీయ శాస్త్రీయ భరతనాట్యం నృత్యకారిణి. ఇక బిందేశ్వర్ పాఠక్ ఒక సామాజిక శాస్త్రవేత్త మరియు సామాజిక వ్యవస్థాపకుడు. ఈయన గత సంవత్సరం ఆగస్టులో మరణించారు. రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు కొంతమంది నెటిజన్లకు అంతగా నచ్చలేదు. సమాజంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన వీరిపై వర్మ చేసిన అనుచితవ్యాఖ్యలని ఖండిస్తున్నారు.

Latest News

More Articles