Friday, May 3, 2024

సంచలనం సృష్టించిన మహిళా హత్యకేసును ఛేదించిన పోలీసులు

spot_img

శంషాబాద్: శంషాబాద్ లో సంచలనం సృష్టించిన మహిళా హత్యకేసు మిస్టరీని పోలీసులు చేధించారు. అప్పుగా తీసుకున్న డబ్బులు చెల్లించి విషయంలో హత్య జరిగినట్లుగా పోలీసులు పేర్కొంటున్నారు. శంషాబాద్ జోన్ డిసిపి నారాయణరెడ్డి మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.

‘‘ఈ నెల 10 అర్ధరాత్రి మహిళా మృత దేహాన్ని గుర్తించాము. డెడ్ బాడీ పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉంది. కాళ్ళకు మెట్టెలు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి కేసు చేదించే ప్రయత్నం చేశాం. అదే సమయంలో 11వ తేదీ శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఓ మిస్సింగ్ కేసు నమోదు అయింది.

డెడ్ బాడీ దొరికిన స్పాట్లో తాళాలు మెడికల్ స్లిప్ కూడా దొరికింది. ఆ తాళాలు తీసుకుని వెళ్లి మృతురాలు ఇంట్లో కబోర్డ్ ఓపెన్ చేసాం. దీంతో మిస్సయింది చనిపోయింది మంజులాగా గుర్తించాం. 10వ తేదీన ఉదయం మంజుల ఇంట్లో నుండి బయటకు వచ్చింది. ఆర్థిక లావాదేవీలు హత్య కు కారణం..గా గుర్తించాము.రిజ్వానా బేగం అనే మహిళ నిందితురాలిగా గుర్తించాము.

రిజ్వానా బేగం గతంలో ఎయిర్పోర్టులో పనిచేసింది ప్రస్తుతం ఫ్యాన్సీ స్టోర్ రన్ చేస్తుంది.రీజ్వనా బేగం కు మంజుల ఒక లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చినట్టు గుర్తించాము. లక్ష రూపాయలు వివాదంతోనే మంజులను రిజ్వానా హత్య చేసింది. తీసుకున్న అప్పుకు బాండ్ రాసి ఇస్తాను అని ఇంటికి పిలిపించింది రిజ్వానా. అక్కడే ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ఈ క్రమంలో భోజనం విషయంలో ఇద్దరికీ మధ్య గొడవ జరిగింది.

ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం మంజుల కండ్లలో కారం పొడితో దాడి చేసింది. ఆ తర్వాత చీర కొంగుతో మంజుల మెడ గట్టిగా ఊపిరి ఆడకుండా చేసి చంపింది. అనంతరం మృతదేహాన్ని ఇంట్లో బెడ్ కింద దాచిపెటింది. అనంతరం రాత్రి 11 గంటలు దాటిన తర్వాత మృతదేహాన్ని ఇంట్లో నుండి బయటకు తీసుకువచ్చింది. కొద్ది దూరం లాక్కొని వచ్చి పెట్రోల్ సిద్ధం చేసుకుని మృతదేహాన్ని బండిపై తీసుకువచ్చింది.

సాయి ఎంక్లవ్ ఖాళీ స్థలంలో పెట్రోల్ పోసి తగలబెట్టింది. పెట్రోల్ పోసి తగలబెట్టిన అనంతరం అక్కడ నుండి వెళ్లిపోయింది.వెళ్తూ వెళ్తూ మృతురాలి మెడలో పుస్తెలతాడు తీసుకొని వెళ్లింది. రిజ్వా నాకు ఎవరు సహకరించలేదు.బాడీని తగలబెట్టిన అనంతరం కొత్తూరు వెళ్లిపోయింది.

24 గంటల్లోనే కేసును చేదించాము. మృతురాలి దగ్గర తీసుకున్న పుస్తెలతాడును 83 వేలకు ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టింది. మంజులాకు రిజ్వానాకు మధ్య చాలా కాలం నుండి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. రీజ్వానా బేగం ను  కస్టడీలోకి తీసుకున్నాం.. నేడు రీమాండ్ కు తరలిస్తాము. రిజ్వానా బేగం తన భర్త కలిసి అజ్మీర్ వెళ్లడానికి టికెట్స్ బుక్ చేసుకున్నారు.’’ అని శంషాబాద్ జోన్ డిసిపి వివరించారు.

Latest News

More Articles