Thursday, May 2, 2024

సీబీఐ, ఈడీల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

spot_img

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఈడీల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దక్షిణాది ప్రాంతాన్ని అవమానించేలా ‘సౌత్‌ గ్రూప్‌’ అనే పదాన్ని ఎలా వినియోగిస్తారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

చార్జిషీట్లు, ఎఫ్‌ఐఆర్‌లలో ‘సౌత్‌ గ్రూప్‌’ అనే పదాన్ని వినియోగించి.. ఈడీ, సీబీఐలు దక్షిణాది రాష్ట్రాల ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని హైదరాబాద్‌కు చెందిన పటోళ్ల కార్తీక్‌రెడ్డి సుప్రీంకోర్టులో ప్రజాహిత పిల్ వేశారు. ఈ పిల్‌పై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.

జాతీయ దర్యాప్తు సంస్థలు ఒక ప్రాంతానికి చెందిన ప్రజల మనోభావాలను గౌరవించాలని సూచించింది. దర్యాప్తు సంస్థలు ఒక ప్రాంతాన్ని ఎత్తిచూపుతూ అధికారిక పత్రాల్లో పేర్కొనటంపై సుప్రీం అగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని,  లేకుంటే తామే తగిన ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని సుప్రీం హెచ్చరించింది.

Latest News

More Articles