Thursday, May 2, 2024

ఆర్జీవీ ‘వ్యూహం’ సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్

spot_img

సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. జనవరి 11 వరకు వ్యూహం సినిమాను విడుదల చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యూహం సినిమాను నిర్మించారని, అందుకే సినిమా విడుదలను నిలిపివేయాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు జస్టిస్‌ సూరేపల్లి నంద గురువారం విచారణ జరిపారు. ఉదయం 11.45 నుంచి సాయంత్రం దాకా సుదీర్ఘ వాదనలను విన్న న్యాయమూర్తి.. రాత్రి 11.30 తరువాత మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 11 వరకు సినిమాను విడుదల చేయొద్దంటూ స్పష్టం చేశారు.

Read Also: బీజేపీలో అంతర్గత లొల్లి.. పార్టీ మారే ఆలోచనలో ఈటల, కొండా?

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల ఆధారంగా చేసుకుని రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన పొలిటికల్ డ్రామానే ఈ వ్యూహాం సినిమా. దాసరి కిరణ్ కుమార్ నిర్మాత. రంగం సినిమా ఫేం అజ్మల్ అమీర్, మానస రాధాకృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించారు. డిసెంబర్ 29న ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది.

వ్యూహం సినిమాపై ఏపీ హైకోర్టులో కూడా ఓ పిటిషన్ దాఖలైంది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ కోర్టును ఆశ్రయించింది. సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ పరువుకు నష్టం కలిగించేలా పాత్రలు ఉన్నాయని రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మీసాల రాజేశ్వరరావు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు శుక్రవారం విచారణ జరపనుంది.

మరిన్ని వార్తలు..

Latest News

More Articles