Thursday, May 2, 2024

యోగి సర్కార్ ఫిదా.. తెలంగాణపై యూపీ అధికారుల ప్రశంశలు

spot_img

జాతీయ స్థాయిలో మహిళా విభాగంలో ఉత్తమ పంచాయతీ అవార్డు దక్కించుకున్న సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలం ఏపూరు గ్రామాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పంచాయితీరాజ్ డిపార్ట్ అధికారులు, గ్రామ సర్పంచులు మంగళవారం సందర్శించారు. మహిళా విభాగంలో జాతీయ స్థాయిలో అవార్డు రావడానికి ఏ విధంగా కృషి చేశారని గ్రామ పాలకవర్గాన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి గ్రామంలో మహిళల కోసం చేసిన అభివృద్ధి పనులను, మహిళలు ఆర్థికంగా ఎలా స్వయం సమృద్ధి సాధించారో వారికి వివరించారు. సంతులిత గ్రామీణాభివృద్ధిలో భాగంగా మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబన, మహిళల ఆరోగ్యం, రాజకీయ అవగాహన తదితర కార్యక్రమాలపై మహిళలకు గ్రామ పంచాయతీ ద్వారా అవకాశాలు కల్పించామని తెలిపారు.

అనంతరం గ్రామ వీధుల్లో తిరుగుతూ గ్రామంలోని మహిళా పార్క్, అంగన్ సెంటర్, మహిళా వ్యాయామశాల, చిల్డ్రన్ పార్క్, హెల్త్ సబ్ సెంటర్, వైకుంఠధామం, నర్సరీ, సెగ్రిగేషన్ షెడ్ చూసి, ఇవన్నీ చాలా బాగున్నా యన్నారు. గ్రామ పంచాయతీ నర్సరీ, ప్రతి సంవత్సరం ఇంటింటికీ ఆరు మొక్కల పంపిణీ గురించి తెలుసుకొని వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

తమ రాష్ట్రంలో కూడా ఇవన్నీ అమలు చేసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జిల్లా పంచాయతీ అధికారులు, గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అయితే డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకునే బీజేపీ.. ఉత్తర్ ప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ యోగి అధికారులు తెలంగాణ అభివృద్ధికి, సాధిస్తున్న అవార్డులకు ఫిదా అయిపోవటం ఒక్కటి చాలు బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం పరుగులుపెడుతున్న తీరుకి నిదర్శనం.

Latest News

More Articles