Thursday, May 2, 2024

ఫిబ్ర‌వ‌రిలో విజయ్ దేవరకొండ-రష్మిక ఎంగేజ్‌మెంట్?

spot_img

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ న‌టులు విజయ్ దేవ‌ర‌కొండ‌, రష్మిక ఒక్కటి కాబోతున్నారన్న వార్తలు సినీ సర్కిళ్లో వినిపిస్తున్నాయి. ఈ ఇద్ద‌రూ గతకొంత కాలంగా ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్ళి కూడా చేసుకుంటారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అప్పుడ‌ప్పుడు వీరిద్దరూ క‌లిసి ఒకే లోకేషన్‌లో దిగిన ఫోటోలను వేర్వేరుగా ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం కూడా ఆ వార్త‌ల‌కు మరింత బలం చేకూర్చాయి. ఫిబ్రవరి రెండవ వారంలో ఇద్దరూ తమ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన వార్త‌ను అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను బట్టి తెలుస్తోంది. దీనిపై అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు ఇది ఫేక్ న్యూస్ అని కొందరు అంటుండ‌గా.. మ‌రికొంద‌రు వీరిద్దరి జోడి బాగుంటుందని, క్యూట్ పెయిర్ అని కామెంట్స్ చేస్తున్నారు.

Latest News

More Articles