Sunday, April 28, 2024

సచిన్ రికార్డులు బద్దలుకొట్టిన కోహ్లీ

spot_img

రన్‎మెషిన్ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌ చరిత్రలో అత్యధిక సెంచరీలు (50) చేసిన ఏకైక బ్యాటర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పటివరకు వన్డేల్లో 49 సెంచరీలు చేసిన కోహ్లీ.. వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో సెంచరీతో చెలరేగాడు. తద్వారా వన్డే ఫార్మాట్‌లో 50 సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో సచిన్ 49 సెంచరీలు చేయగా, తాజాగా న్యూజిలాండ్‌పై శతకొట్టిన కోహ్లీ 50 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. అంతేకాకుండా వరల్డ్ కప్‎లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. సచిన్ 673 పరుగులతో టాప్ ప్లేస్‎లో ఉండగా.. ఆ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. విరాట్ 711 పరుగులతో టాప్ ప్లేస్‎లోకి వచ్చాడు.

ఇక ఈ మ్యాచుల్ టీమ్‌ఇండియా ఘనవిజయం సాధించడంతో వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచింది. కోహ్లి 113 బంతుల్లో 117, శ్రేయస్‌ అయ్యర్‌ 70 బతుల్లో 105 పరుగులతో శతకాలు బాదడంతో భారత్‌ 4 వికెట్లకు 397 పరుగుల భారీ స్కోరును సాధించింది.

Latest News

More Articles