Sunday, April 28, 2024

వన్డేల్లో 14 ఏళ్ల రికార్డు బ‌ద్ధ‌లుకొట్టిన జింబాబ్వే

spot_img

వన్డేల్లో 14 ఏళ్ల రికార్డును  జింబాబ్వే బ‌ద్ధ‌లుకొట్టింది. వ‌న్డేల్లో అత్య‌ధిక స్కోర్ న‌మోదు చేసి సంచలనం సృష్టించింది. వ‌రల్డ్ క‌ప్ క్వాలిఫైయ‌ర్స్‌లో భాగంగా ఈరోజు అమెరికాతో జ‌రిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 408 ప‌రుగులు కొట్టి చరిత్ర తిరగరాసింది.

కెప్టెన్ సియాన్ విలియ‌మ్స్(174) సెంచ‌రీతో చెలరేగగా.. గుంబీ (78) అర్ధ శ‌త‌కంతో రాణించారు. దీంతో 6 వికెట్ల న‌ష్టానికి 408 ర‌న్స్ చేసింది జింబాబ్వే. ఇంత‌కుముందు వ‌న్డేల్లో జింబాబ్వే అత్య‌ధిక స్కోర్ 351/7. కెన్యాపై 2009 జ‌న‌వ‌రి 29న ఇది నమోదు చేసింది.

Latest News

More Articles