Sunday, April 28, 2024

బర్రెలక్క ప్రి వెడ్డింగ్ షూట్ వైరల్..మీరూ చూడండి.!

spot_img

బర్రెలక్క…ఈమె గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఓడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. త్వరలోనే బర్రెలక్క పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈమధ్యే ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంది. తాజాగా ప్రివెడ్డింగ్ వీడియో కూడా చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తనకు కాబోయే భర్తను ఇన్ స్టాగ్రామ్ వేదికగా పరిచయం చేసింది బర్రెలక్క. ఆ యువకుడి పేరు వెంకటేశ్. ఈ వేసవిలో వీరిద్దరి పెళ్లి జరగనుంది. అయితే బర్రెలక్కకు కాబోయే భర్త ఏం చేస్తాడు. ఆయన ఊరు గురించి ఎలాంటి వివరాలు బయటకు రాలేదు.

ఇది కూడా  చదవండి: రూ. 10వేలకే శాంసంగ్ 5జీ మొబైల్..బంపర్ ఆఫర్ మీకోసం..

Latest News

More Articles