Tuesday, May 7, 2024

కడిగిన ముత్యంలా బయటికి వస్తా

spot_img

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ఇవాళ్టి(మంగళవారం) నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆమెను రౌజ్‌ అవెన్యూ కోర్టులో దర్యాప్తు సంస్థ అధికారులు హాజరుపరిచారు. ఈడీ తరఫు న్యాయవాది జోయబ్‌ హుస్సేన్‌ ఆన్‌లైన్‌లో వాదనలు వినిపించారు. 15 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీకి పంపాలని కోరారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని.. పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు.

కోర్టుకు హాజరుపరిచిన సమయంలో కవిత మీడియాతో మాట్లాడారు. ఇది మనీలాండరింగ్‌ కేసు కాదు.. పొలిటికల్‌ లాండరింగ్‌ కేసు అని అని అన్నారు. ఈ కేసులో కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పారు. తాత్కాలికంగా జైల్లో పెడతారు..మా ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీయలేరు అని అన్నారు. తప్పుడు కేసు, ఇది రాజకీయ కుట్ర అని చెప్పారు. మనీ లాండరింగ్ కేసు కాదిది, పొలిటికల్ లాండరింగ్ కేసు లా ఉందన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి బీజేపీ లో చేరారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యక్తి బీజేపీ కూటమి లో పోటీ చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మూడో వ్యక్తి బీజేపీకి 50 కోట్ల విరాళాలు ఇచ్చారని తెలిపారు ఎమ్మెల్సీ కవిత.

ఇది కూడా చదవండి: కొత్త రేషన్ కార్డులపై కీలక అప్‌డేట్..!

Latest News

More Articles