Thursday, May 2, 2024

భోళామేనియా.. మెగా బీభత్సమే..!

spot_img

మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ నుంచి భోళా మేనియా లిరికల్ వీడియో సాంగ్‌ వచ్చేసింది. వేదాళ‌మ్ రీమేక్‌గా మెహర్‌ రమేశ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది.

ఇప్పటికే విడుదలైన భోళా మేనియా ప్రోమో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ లిరికల్ సాంగ్‌ లో చిరు మ్యానరిజంలో కంపోజ్‌ చేసిన స్టెప్పులతో ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను మహతి స్వరసాగర్‌, ఎల్‌వీ రేవంత్‌ పాడారు.

భోళాశంకర్‌ జూన్‌ చివరి నాటికి షూటింగ్ పూర్తి కానుంది. అనంతరం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభం అవుతాయని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 11న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

Latest News

More Articles