Monday, May 6, 2024

స్పామ్​ కాల్స్, మెసేజ్​లతో విసిగెత్తిపోయారా? ఇక్కడ ఫిర్యాదు చేయండి

spot_img

స్పామ్​ కాల్స్​, జంక్​ మెసేజ్​లు, ఫ్రాండ్​ మెసేజ్​లతో విసిగెత్తి పోయారా? అయితే.. మీకోసం..కేంద్రం ఓ కొత్త పోర్టల్​ని తీసుకొచ్చింది. దీని పేరు చక్షు పోర్టల్​. అనుమానిత ఫ్రాడ్​ కాల్స్​, మెసేజ్​లను ఇందులో రిపోర్టు చేయవచ్చు. గడిచిన 30 రోజుల్లో ఏదైనా స్పామ్​ కాల్​- మెసేజ్​ అందితే.. దానిని పోర్టల్​లో ఫిర్యాదు చేయవచ్చు.

టెలికాం వసతులను దుర్వినియోగం చేయకుండా చూసుకునేందుకు.. బ్యాంకులు, ఆర్థిక వ్యవస్థలు, దర్యాప్తు సంస్థలతో కోఆర్డినేట్​ చేసేందుకు డిజిటల్​ ఇంటెలిజెన్స్​ ప్లాట్​ఫామ్ (డీఐపీ)​ని లాంచ్​ చేసింది భారత ప్రభుత్వం. భారత ప్రజలు.. ఫ్రాడ్​ సమాచారాన్ని రిపోర్టు చేయవచ్చు. అది ఫోన్​ కాల్​ అయినా, ఎస్​ఎంఎస్​ అయినా, వాట్సాప్​ లాంటి సోషల్​ మీడియా యాప్స్​ అయినా పర్లేదు. ఫిర్యాదు అందిన తర్వాత.. డీఐపీ ప్లాట్​ఫామ్​.. రీ- వెరిపికేషన్​ ప్రక్రియను ప్రారంభిస్తుంది. రీ- వెరిఫికేషన్​లో తప్పులు బయటపడితే.. ఆ నెంబర్​ ఇక డిస్కంటిన్యూ అయిపోతుంది

సంచార్​ సాతి వెబ్​సైట్​లో.. ఈ చక్షు పోర్టల్​ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా కాల్స్​, ఎస్​ఎంఎస్​, వాట్సాప్​లో అంది ఫ్రాడ్​ కమ్యూనికేషన్​ని రిపోర్ట్​ చేయవచ్చు.సెక్స్​టార్షన్​ కేసులకు ఈ పోర్టల్​ బాగా ఉపయోగపడుతుంది. కొందరు.. ప్రభుత్వ అధికారులం అంటూ మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంక్​ వివరాలను అడుగుతున్నారు. అలాంటి కేసులను కూడా ఇక్కడ ఫిర్యాదు చేయవచ్చని  సంబంధిత వర్గాలు తెలిపాయి.

sancharsaathi.gov.in వెబ్​సైట్​లోకి వెళ్లండి, కిందకి స్క్రోల్​ చేసి సిటిజెన్​ సెంట్రిక్​ సర్వీసెస్​పై క్లిక్​ చేయండి. తర్వాత చక్షు పోర్టల్​ ఆప్షన్​ని ఎంచుకోండి. ఫ్రాడ్​ కాల్​, మెసేజ్​లను ఫిర్యాదు చేసేందుకు కంటిన్యూ మీద క్లిక్​ చేయండి.  సంబంధిత కాల్​, మెసేజ్​ డేటాను షేర్​ చేయాలని మీకు కనిపిస్తుంది. ఫ్రాడ్​ కేటగిరీని సెలక్ట్​ చేసుకోండి. సంబంధిత స్క్రీన్​షాట్​ని అప్లోడ్​ చేయండి. ఫ్రాడ్​కు పాల్పడిన అనుమానిత మొబైల్​ నెంబర్​, డేట్​- టైమ్​ వంటి వివరాలను ఎంటర్​ చేయాల్సి ఉంటుంది. ఆతర్వాత మీ పూర్తి పేరు, డేట్​ ఆఫ్​ బర్త్​, ఫోన్​ నెంబర్​, ఓటీపీ వంటి వివరాలను ఫిల్​ చేయాలి. దీంతో మీ కంప్లైంట్​ రిజిస్టర్​ అవుతుంది. అనంతరంసంబంధిత నెంబర్ ​పై రీ- వెరిఫికేషన్​ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ఇది కూడా చదవండి:తెలంగాణ నుంచి తరలిపోతున్న కంపెనీలు.. కేటీఆర్ ఆవేదన

Latest News

More Articles