Thursday, May 2, 2024

కోవిడ్ డేంజర్ బెల్స్..15 నెలల చిన్నారికి కోవిడ్..నిలోఫర్ ఆసుపత్రిలో తొలి కేసు..!!

spot_img

నీలోఫర్ ఆసుపత్రిలో మొదటి కోవిడ్ కేసులు నమోదు అయ్యింది. హైదరాబాద్ నాంపల్లిలోని నిలోఫర్ ఆసుపత్రిలో 15నెలల చిన్నారికి కోవిడ్ సోకింది. నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన 15 నెలల పాప నాలుగు రోజులుగా తీవ్ర జ్వరం, ఊపిరిపీల్చుకునేందుకు ఇబ్బంది పడుతుంది. దీంతో ఆ చిన్నారిని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసిన వైద్యులు..అనుమానంతో కోవిడ్ టెస్ట్ చేశారు. దీంతో పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వెంటిలేటర్ పై తొలగించి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

ఇక దేశవ్యాప్తంగా కోవిడ్ డేంజర్ బెల్స్ మోగిస్తున్న సంగతి తెలిసిందే. గడిచిన 24గంటల్లో 328 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం 2997 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: వాహనదారులకు గుడ్‎న్యూస్.. మరోసారి చలాన్లకు రాయితీ!

Latest News

More Articles