Monday, May 6, 2024

నేడు హైదరాబాద్‌లో క్రిస్మస్‌ వేడుకలు.. పలు మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

spot_img

ఈ రోజు హైదరాబాద్‌లోని పలు మార్గాల్లో ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ రోజు క్రిస్మస్‌ వేడుకలను నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5 నుంచి జరుగనున్న ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు హాజరుకానున్నారు. ఈనేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. ఈ సమయంలో పలు మార్గాల్లో మూసివేతలు, దారిమళ్లింపులు ఉంటాయని వెల్లడించారు. ఈనేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

Read also; వాహనదారులకు గుడ్‎న్యూస్.. మరోసారి చలాన్లకు రాయితీ!

ప్రత్యామ్నాయ మార్గాలు

  • ఏఆర్‌ పెట్రోల్‌బంక్‌ కూడలి నుంచి బషీర్‌బాగ్‌ బీజేఆర్‌ విగ్రహం జెంక్షన్‌ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. నాంపల్లి లేదా రవీంద్రభారతి వైపు పంపిస్తారు.
  • అబిడ్స్‌, గన్‌ఫౌండ్రి వైపునుంచి వచ్చే ట్రాఫిక్‌ను బషీర్‌బాగ్‌ బీజేఆర్‌ విగ్రహం కూడలివైపు అనుమతించరు. గన్‌ఫౌండ్రిలోని ఎస్‌బీఐ నుంచి సుజాతా స్కూల్‌, చాపెల్‌ రోడ్డు వైపు పంపిస్తారు.
  • ట్యాంక్‌బండ్ నుంచి బషీర్‌బాగ్‌ కూడలి వైపు వచ్చే వాహనాలను లిబర్టీ జంక్షన్‌ నుంచి హిమాయత్‌నగర్‌ వైపు మళ్లిస్తారు.

Latest News

More Articles