Monday, May 6, 2024

భట్టి మీటింగులో పవర్ కట్.. 20నిమిషాల పాటు చీకట్లోనే డిప్యూటీ సీఎం.!

spot_img

కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పాలన ఏ రీతిలో ఉందని చెప్పడానికి ఉదాహరణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రెస్ మీట్. రాష్ట్రంలో అసలు కరెంట్ కోతలే లేవని చెబుతున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడేం సమాధానం చెబుతారో. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి దాపురించింది. రెప్పపాటు కరెంట్ పోదని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడేం సమాధానం చెబుతారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లుభట్టివిక్రమార్క పాల్గొన్న ఓ మీటింగ్ కరెంటు పోయింది. దీంతో చేసేది ఏమీ లేక దాదాపు 20 నిమిషాలపాటు చీకట్లోనే ఉన్నారు. ఆయన శనివారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆపార్టీ నేతలతో సమావేశం అయ్యారు. వీరు సమావేశమైన కొద్దిసేపటికే ఆ ప్రాంతంలో కరెంటు పోయింది.

కాసేపటికి చుట్టుపక్కల ప్రాంతాల్లో కరెంటు వచ్చినప్పటికీ..సీపీఐ కార్యాలయంలో మాత్రం పవర్ రాలేదు. దీంతో భట్టి సహా సీపీఐ నేతలు కాసేపు చీకట్లోనే గడిపారు. దీనికి సంబంధించి ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

ఇది కూడా చదవండి: రేవంత్ రమ్మంటున్నాడు..పార్టీ మారే ఆలోచన లేదు.!

Latest News

More Articles