Saturday, April 27, 2024

సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో బ్రెయిన్‌ సర్జరీ

spot_img

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో బ్రెయిన్‌ సర్జరీ చేయించుకున్నారు. ఈ నెల 17న మెదడులో భారీ వాపు, రక్తస్రావం కావడంతో వెంటనే ఆయనను అపోలో ఆసుపత్రిలో చేరారు. అదే రోజు డాక్టర్ల బృందం ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించింది.

సద్గురు ఆరోగ్యంపై జర్నలిస్ట్‌ ఆనంద్‌ నరసింహన్‌ సోషల్‌ మీడియాలో అప్‌డేట్‌ ఇచ్చారు. సద్గురు గత కొద్దిరోజులుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారని ఆయన తెలిపారు. సమాచారం మేరకు సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు డాక్టర్‌ వినీత్‌ సూరీ ఆధ్వర్యంలో పరీక్షలు చేశారు. ఆయన సూచనతో ఎంఆర్‌ఐ చేయించుకున్నారు. పరీక్షల్లో మెదడులో భారీగా రక్తస్రావం జరిగినట్లుగా గుర్తించారు. 17న ఆరోగ్యం వేగంగా క్షీణించడంతో పాటు పలుసార్లు వాంతులు చేసుకున్నారు.

తీవ్రమైన తలనొప్పితో ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత సీటీ స్కాన్‌ చేయగా రక్తస్రావంతో పాటు మెదడులో తీవ్రమైన వాపు కూడా ఉన్నట్లు తేలింది. దీంతో ఢిల్లీ అపోలోకు చెందిన డాక్టర్లు వినిత్‌ సూరీ, ప్రణవ్‌ కుమార్‌, సుధీర్‌ త్యాగి, ఎస్‌ ఛటర్జీ నేతృత్వంలోని బృందం ఆయనకు అత్యవసర శస్త్ర చికిత్స చేసింది. ఆపరేషన్‌ విజయవంతమైందని.. ఆయన బాగా కోలుకుంటున్నారని నరసింహన్‌ సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు.

ఇది కూడా చదవండి: వంద మంది గ్యాంగ్‌స్టర్లను ఎన్ కౌంటర్ చేసిన పోలీస్ అధికారికి జైలుశిక్ష

Latest News

More Articles