Thursday, May 2, 2024

బిఆర్ఎస్ నేతలపై దాడి దుర్మార్గమైన చర్య

spot_img

సూర్యాపేట : ఎన్నికలు జరిగి నెల రోజులు కూడా అవకముందే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బిఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ శ్రేణులు దాడులకు పాల్పడటం దుర్మార్గమని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డిగూడెం మండలం, కాసర్ల పహాడ్ గ్రామానికి చెందిన బిఆర్ ఎస్  నాయకుడు, ఆదర్శ రైతు , కేసీఆర్ వీరాభిమాని అయిన మేండే సురేష్ పై కాంగ్రెస్ శ్రేణులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండించారు. జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న సురేష్ ను తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాధరి కిషోర్ కుమార్ తో కలిసి జగదీష్ రెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ఇరువురు నేతలు ధైర్యం చెప్పారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి.. ఘర్షణలు తెలంగాణ సమాజానికి మంచిది కాదన్నారు. రాజకీయ తగదాలతో గ్రామాలకు గ్రామాలు వల్లకాడులు అయిన గత చరిత్ర నల్గొండ జిల్లాది అన్న జగదీష్ రెడ్డి, ఘర్షణలు అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తాయని, గడిచిన 10 ఏళ్లుగా మా పాలనలో రాజకీయ ఘర్షణలకు తావు లేకుండా చేశాం అన్నారు. చిన్నాచితక ఘర్షణలు జరిగినా పార్టీలకతీతంగా వ్యవహరించి ఆదిలోనే అణిచివేశామన్నారు. ఉమ్మడి జిల్లాలో రాజకీయ దాడులను ఆపాల్సిన బాధ్యత జిల్లా మంత్రులది, పోలీసు అధికారులదే అన్నారు. ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే నల్లగొండ జిల్లా నాశనం అవుతుంది అన్నారు.

Latest News

More Articles