Sunday, April 28, 2024

హామీల అమలులో కాంగ్రెస్ మాట తప్పింది

spot_img

హామీల అమలులో కాంగ్రెస్ మాట తప్పిందన్నారు  మాజీ మంత్రి హరీశ్ రావు. ఈ ఎన్నికల్లో మెదక్ మీద గులాబీ జెండా ఎగరటం ఖాయం అన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన మెదక్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడారు.బీజేపీ అభ్యర్థి మంచోడు అయితే దుబ్బాకలో గెలవాలి కదా. పనితీరు బాగోలేదని 54 వేల ఓట్లతో ప్రభాకర్ రెడ్డిని గెలిపించారు.చింతా ప్రభాకర్ ను గెలిపించినట్లుగా, వెంకట్రామిరెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించాలి. ఎంతో మంచి మనిషి, పేద పిల్లల కోసం 100 కోట్లతో నిధి ఏర్పాటు చేయడం గొప్ప విషయం. రెండు లక్షల రుణమాఫీ అని మాట తప్పింది కాంగ్రెస్. రైతు బంధు అన్ని మాట తప్పింది, బోనస్ అని మాట తప్పింది. పింఛన్లు ఇవ్వలేదు. 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదు. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ వాళ్లు ఓట్లు అడుగుతారు. వంద రోజుల పాలన చూసి ఓటు వేయాలి అని అంటున్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే హామీలు అమలు చేయకున్నా ఒప్పుకున్నట్టు అవుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలన్నారు.

చోటే భాయ్ బడే భాయ్ రేవంత్ రెడ్డి… మోడీ ఆశీర్వాదం తీసుకున్నాడు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే అని అన్నారు హరీశ్ రావు. ముస్లింలను క్యాబినెట్ మంత్రిగా ఏనాడూ తీసుకోలేదు కాంగ్రెస్ అని అన్నారు. కేసీఆర్ ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రిని చేసారు. బడ్జెట్ లో నిధులు కోత విధించారు. రంజాన్ తోఫా కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. బీజేపీ పై బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది. వాళ్ళతో ఒప్పందం పెట్టుకోలేదనే ఈరోజు కవితను జైలుకు పంపారు. ఒప్పందం పెట్టుకుంటే కవిత అరెస్టు అయ్యేవారా అని ప్రశ్నించారు హరీశ్ రావు. నచ్చినోళ్లు జేబులో, నచ్చ్చనోళ్లు జైల్లో ఉండాలే అన్నట్టు ఉంది బీజేపీ వైఖరి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారన్నారు. ప్రతిపక్ష పార్టీలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు.కేసీఆర్ ఎప్పుడు బీజేపీతో కలిసేది లేదు.మాది సెక్యులర్ పార్టీ. బీజేపీ, కాంగ్రెస్ రెండు కలిసి మోసం చేసాయన్నారు.

154 మెడికల్ కాలేజీలు ఇస్తే ఒక్కటి మనకు ఇవ్వలేదు. కేసీఆర్ సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ఇచ్చారు. రెండు పార్టీలను చిత్తూగా ఓడించాలని పిలుపునిచ్చారు హరీశ్ రావు. రేవంత్ రెడ్డి హామీల అమలు మీద ద్రుష్టి పెట్టు అని సూచించారు. కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలు గమనిస్తున్నారు. బీఆర్ఎస్ గెలవాలి, తెలంగాణ నిలవాలి అని అన్నారు హరీశ్ రావు.

ఇది కూడా చదవండి: ఈ ఎన్నిక‌ల త‌ర్వాత బీజేపీలోకి రేవంత్ వెళ్లడం ఖాయం

Latest News

More Articles