Friday, May 10, 2024

రేవంత్ హామీల వైఫల్యం పై చర్చకు వస్తావా జూపల్లి ..?

spot_img

టెట్ కు సంబంధించి అభ్యర్థులు మాకు అనేక విన్నపాలు చేస్తున్నారు…టెట్ తో పాటు ఏ ఉద్యోగ పరీక్ష కు ఫీజులు వసూలు చేయమని కాంగ్రెస్ మేనిఫెస్టో లో పెట్టారు.ఆ హామీని ఉల్లంఘించి టెట్ ఫీజు గతం లో కన్నా 150 శాతం పెంచారని బీఆర్ఎస్ నేత వాసుదేవ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ( మంగళవారం) హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన..దరఖాస్తు దారులు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదని అభయ హస్తం మేనిఫెస్టో లో పెట్టారు. రేపటి నుంచి టెట్ దరఖాస్తులు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టో లో పెట్టిన హామీకి అనుగుణంగా నడుచుకోవాలి. లేకుంటే టెట్ అభ్యర్థులతో కలిసి ఉద్యమిస్తామన్నారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు మా నేత హరీశ్ రావు పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు వాసుదేవ రెడ్డి. రైతుల బాధలను హరీశ్ రావు ప్రస్తావిస్తే తప్పేంటి..పంట నష్టపోయినపుడు కేసీఆర్ హయం లో 10 వేల రూపాయలు నష్టపరిహారం ఇచ్చింది నిజం కాదా..రైతుల గురించి పట్టించుకోమని హరీశ్ రావు అడిగితే జూపల్లి కి ఎందుకు అంత అక్కసు ? అని ప్రశ్నించారు. రేవంత్ రైతులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క దాన్ని అమలు చేయలేదు. రేవంత్ హామీల వైఫల్యం పై చర్చకు వస్తావా జూపల్లి ? అని సవాల్ విసిరారు వాసుదేవ రెడ్డి. జూపల్లి బీఆర్ ఎస్ మొదటి టర్మ్ లో మంత్రిగా ఉన్నానన్న విషయం మరచిపోతున్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ మంత్రులు దోచుకున్నారు అంటున్నారు..మరి ఐదేండ్లు మంత్రిగా ఉన్న జూపల్లి ఎంత దోచుకున్నారో చెప్పాలన్నారు.ఒక వేలు మా వైపు చూపితే జూపల్లి వైపు నాలుగు వేళ్ళు చూపుతామన్నారు. రాజకీయ వ్యాఖ్యలు మాని రైతుల శ్రేయస్సు గురించి ఆలోచించాలన్నారు.కాంగ్రెస్ నేతలకు రైతుల మీద ప్రేమ ఉంటె మేనిఫెస్టో లో పెట్టిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే రైతు రుణ మాఫీ అమలు చేయాలన్నారు. యాసంగి పంటకు మద్దతు ధర తో పాటు బోనస్ చెల్లించాలి. రైతులను నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కి పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు వాసుదేవ రెడ్డి.

ఇది కూడా చదవండి: హామీల అమలులో కాంగ్రెస్ మాట తప్పింది

Latest News

More Articles