Sunday, April 28, 2024

డెల్ లో భారీగా ఉద్యోగుల తొలగింపు

spot_img

టెక్ దిగ్గ‌జాలు లేఆఫ్స్ ను కొన‌సాగిస్తూనే ఉన్నాయి. ఓవైపు ఉద్యోగుల సంఖ్య‌ను కుదిస్తూనే హైరింగ్‌ను కూడా ప‌రిమితంగా చేప‌డుతున్న‌ట్టు డెల్ తెలిపింది. వ్య‌య నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా డెల్ 6000 మంది ఉద్యోగుల‌పై వేటు వేసింది. గ‌త రెండేండ్లుగా త‌న కంప్యూట‌ర్లను ఎక్కువ మంది ప్ర‌జ‌లు కొనుగోలు చేయ‌క‌పోవ‌డంతో ఉద్యోగుల సంఖ్య‌ను త‌గ్గిస్తున్న‌ట్టు డెల్ తెలిపింది.

అమ్మకాలు ప‌డిపోవ‌డంతో ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టిన క్ర‌మంలో ఉద్యోగుల‌పై వేటు వేయ‌క త‌ప్ప‌లేద‌ని కంపెనీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక పీసీల‌తో పాటు క్లైంట్స్ సొల్యూష‌న్స్ గ్రూప్ నుంచి ఏడాది మొత్తానికి రాబ‌డి పెరుగుతుంద‌ని డెల్ అంచ‌నా వేస్తోంది. అయితే ఏడాది చివ‌రి మూడు నెల‌ల్లో ఈ రంగం నుంచి రాబ‌డి 12 శాతం ప‌డిపోయింది.

రాబోయే రోజుల్లో కొంత గ‌డ్డు పరిస్ధితులు ఎదురైనా త‌మ ప్రోడ‌క్ట్స్ కు మెరుగైన డిమాండ్ ఉంటుంద‌ని డెల్ అంచ‌నా వేస్తోంది. కాగా ఉద్యోగులకు డెల్ ఇటీవల చేసిన హెచ్చరిక‌ల‌కు టెకీల నుంచి తీవ్ర అసంతృప్తి వ్య‌క్త‌మైంది. ఇప్ప‌టికీ ఇంటి నుంచి ప‌నిచేస్తున్న ఉద్యోగుల‌కు ప్రమోషన్ల విష‌యంలో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోబోమ‌ని డెల్ స్ప‌ష్టం చేసింది. ఉద్యోగులు తిరిగి కార్యాల‌యాల నుంచి ప‌ని చేయ‌డం ప్రారంభించాల‌ని డెల్ కోరింది.

ఇది కూడా చదవండి: ఈ ఎన్నిక‌ల త‌ర్వాత బీజేపీలోకి రేవంత్ వెళ్లడం ఖాయం

Latest News

More Articles