Sunday, April 28, 2024

అమరుల చావులకు కాంగ్రెస్ కారణం కాదా?

spot_img

హైదరాబాద్: క్లారిఫికేషన్ కు అవకాశం ఇవ్వలేదు. ప్రొటెస్ట్ కు కూడా అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం పారిపోయిందని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. సత్య దూర విషయాలను సిఎం రేవంత్ మాట్లాడారని, క్లారిఫికషన్ ఇవ్వడానికి ఎందుకు భయం అని ప్రశ్నించారు.  ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. సభలో కాంగ్రెస్ నేతలు అప్రజాస్వామికంగా వ్యవహరించారని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడారు.

రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు  విమానాశ్రయంలో అంజయ్యని అవమానించారు. పీవీ చనిపోతే కనీసం చూసేందుకు కాంగ్రెస్ నేతలు పోలేదు. సచివాలయం కు ఎదురుగా అమర వీరుల స్మృతి వనం నిర్మించుకున్నాము. రైఫిల్ రెడ్డి ఉద్యమకారుల మీద గన్ ఎక్కుపెట్టాడు. యాదిరెడ్డి కుటుంబానికి ఎన్నడైనా పరామర్శించావా. ఉద్యమకారుల మీద ఉన్న కేసులను ఎత్తి వేసాము. కొన్ని చివరి దశలో ఉన్నాయని తెలిపారు.

వ్యవసాయంలో 6.59 వృద్ది రేటు మన రాష్ట్రము ఉంది అని నీతి ఆయోగ్ తెలిపింది. మద్దతు ధరలేదు అన్నరు..ఇది సత్య దూరం. రూ.1960 రూపాయలకు వడ్లను ప్రభుత్వమే కొన్నది. మీరు ఆనాడు అవలంబించిన రైతు వ్యతిరేక విధానాల వలన ఎంతో మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నరు. రైతు బీమా పొందిన వారిని కూడా రైతు ఆత్మహత్యల కింద సిఎం జమకడుతున్నారు. బోర్ వేల్స్ పెరిగాయి అన్నారు. మీ హయాంలో బోర్లు వేస్తే నీరు రాలేదు దుబ్బ మాత్రమే వచ్చేది. మా హయాంలో భూగర్భ జలాలు పెరిగాయి కాబట్టి బోర్లు వేశారని తెలిపారు.

2 కోట్ల 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించాము. నీటి లభ్యత లేని చోట ప్రాజెక్ట్ చేపట్టిన ఘనత కాంగ్రెస్ ది. పాలమూరులోనీ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు గా మార్చాము. తుమ్మిల్ల ప్రాజెక్ట్ ను 9 నెలలలో పూర్తి చేసి ఆలంపూర్ కు నీరు అందించాము. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్ కూడా పూర్తి అయింది. కాల్వలు తవ్వితే నీరు వస్తది. ఇసుక మీద 5 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. మి హయాంలో జేబులో వేసుకున్నారు. తెలంగాణతో మాకు ఉన్నది పేగు బంధం. సోనియాను బలి దేవత అని రేవంత్ రెడ్డి అన్నారు. అమరుల చావులకు కాంగ్రెస్ కారణం కాదా? వెన్నుపోటు పొడిచి మా ఎంపిలు, ఎమ్మెల్యే లను కాంగ్రెస్ లో చేర్చుకున్నారని ఆయన విమర్శించారు.

Latest News

More Articles