Sunday, April 28, 2024

తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు ఫ్రీగా బుక్ ఫండ్

spot_img

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు మాత్రమే కాకుండా.. పక్క రాష్ట్రాల విద్యార్థులు కూడా ఈ పరీక్షకు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించి విద్యార్థులు కూడా బాగానే ప్రిపేర్ అవుతున్నారు. ఇకపోతే తాజాగా ఈ పరీక్షలు సంబంధించి బీసీ విద్యార్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఓ శుభవార్త చెప్పింది. ఇందులో భాగంగా పరీక్షలకు ప్రిపేర్ అయ్యే బీసీ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బుక్ ఫండ్ తోపాటు స్టడీ మెటీరియల్ ఖర్చును కూడా అందజేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.

ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10వేల మందికి సహాయాన్ని అందిస్తున్నారు. పదివేల మందిలో బీసీ విద్యార్థులు 7000 మంది ఎస్జీటీ పోస్టులకు, అలాగే 3,000 మంది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులను ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎంపికైన వారు రూ. 1500 చొప్పున బుక్ ఫండ్ తో పాటు స్టడీ మెటీరియల్ ఖర్చును అందించబోతున్నారు. అయితే దీనికి సంబంధించి వారి తల్లిదండ్రుల వార్షికోదాయం రూ. 5 లక్షల కంటే మించకూడదు.

అలాగే వారి అకాడమిక్ మెరిట్ రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయబోతున్నట్లు సమాచారం. ఈ విషయం సంబంధించి అభ్యర్థులు ఏప్రిల్ 5లోగా ఆన్లైన్ విధానంలో ఆర్థిక సహాయానికి గాను తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ అధికారిక సైటులో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: కడియం శ్రీహరి కోసం బీఆర్‌ఎస్‌ చాలామంది నేతలను కోల్పోయింది

Latest News

More Articles