Friday, May 10, 2024

కడియం శ్రీహరి కోసం బీఆర్‌ఎస్‌ చాలామంది నేతలను కోల్పోయింది

spot_img

కడియం శ్రీహరి కోసం బీఆర్‌ఎస్‌ చాలా మంది నాయకులను కోల్పోయిందని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజయ్యను కాదని కడియానికి స్టేషన్‌ ఘన్‌పూర్‌ టికెట్‌ను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇచ్చారని అన్నారు. ఇవాళ(శుక్రవారం) పార్టీ నేతలతో కలిసి వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన దాస్యం .. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ మారాలన్నారు. కడియం శ్రీహరికి ప్రజాబలం ఉంటే రాజీనామా చేసి గెలవాలని డిమాండ్‌ చేశారు. ఆయన ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. కడియం ఏ పార్టీలో ఉన్నా కార్యకర్తలను అణచివేశారని ఆరోపించారు. ఆయన ఎంతో మందిని బలిపశువులను చేశారని విమర్శించారు. కడియం కావ్య తీరు బాధ కలిగించిందన్నారు. శ్రీహరి నమ్మక ద్రోహి అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ పార్టీతో కుమ్మక్కై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.

వరంగల్‌లో జరుగుతున్న పరిణామాలకు కడియం బాధ్యులని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి అన్నారు. జిల్లా రాజకీయాలను కడియం బ్రష్ఠుపట్టించాని ఫైర్‌ అయ్యారు. గులాబీ కోటలో చీడపురుగులా కడియం చేరారని విమర్శించారు. ఆయనకు సిగ్గు, శరం ఉంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

కడియం శ్రీహరి తన కుమార్తెతో కలిసి పార్టీ మారుతున్నారని తెలియడంతో.. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో శ్రీహరి ఫొటోలను తొలగించారు. ఫెక్సీలపై ఉన్న ఆయన ఫొటోలపై పార్టీ స్టిక్కర్లను అంటించారు. కడియం డౌన్‌డౌన్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఇది కూడా చదవండి: ఆస్తులను కాపాడుకునేందుకు వివేక్ ఎన్నిసార్లైనా..ఎన్నిపార్టీలైనా మారుతారు

 

 

 

Latest News

More Articles