Monday, May 6, 2024

కేసీఆర్ బయటికి రాగానే రాష్ట్రంలో కాల్వల్లో నీళ్లు పారుతున్నయ్

spot_img

కాంగ్రెస్ అంటేనే లీకులే, ఫేక్ న్యూస్‌లు. పాలన గాలికొదిలేసి అక్రమ కేసులతో కాలయాపన చేస్తున్నారని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ( బుధవారం) భువనగిరిలో బీఆర్‌ఎస్‌ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండమని సీఎం రేవంత్‌ రెడ్డి అంటున్నాడు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బొంద పెట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

కేసీఆర్ బయటికి రాగానే రాష్ట్రంలో కాల్వల్లో నీళ్లు పారుతున్నాయని తెలిపారు హరీశ్ రావు. ఎన్నికల కోడ్ సాకుతో హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని మాట తప్పిందని ఆరోపించారు. ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇస్తాం అని మోసం చేశారు. కాంగ్రెస్‌కు ఓటు అడిగే హక్కు లేదన్నారు. కార్యకర్తలు కాంగ్రెస్ మోసాలను గ్రామాల్లో విడమర్చి చెప్పాలన్నారు. కొంత మంది స్వార్ధపరులు పార్టీని వీడి పోతున్నారు. వాళ్లను ప్రజలు నమ్మడం లేదన్నారు.

క్యామ మల్లేష్ మాస్ లీడర్. భువనగిరిలో తప్పకుండా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. స్వయానా రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసి పార్టీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తి భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అని విమర్శించారు. అసెంబ్లీలో కొట్లాడాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలువాల్సిన అవసరం ఉందన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ సబ్బండ వర్గాలను నిలువునా మోసం చేసిందని ఫైర్ అయ్యారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్ పార్టీనేనని స్పష్టం చేశారు. కొంత మంది పార్టీ వీడి పోతే నష్టమేమి లేదన్నారు. పార్టీ వదిలి పోయిన వారు కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడినా మళ్లీ వారిని పార్టీలో చేర్చుకోమన్నారు. ఈ భూమి ఉన్నంత కాలం బీఆర్‌ఎస్‌ ఉంటుందని, కార్యకర్తలు అంతా ఉద్యమ స్ఫూర్తితో పోరాటం చేయాలని సూచించారు హరీశ్ రావు.

ఇది కూడా చదవండి: టికెట్ అడిగిన టీటీఈని రైల్లో నుంచి తోసేసిన ప్రయాణికుడు

Latest News

More Articles