Sunday, April 28, 2024

ఆ భాష ఏందీ.. సంస్కార హీనంగా..!

spot_img

వరుసగా బీఆర్ఎస్ విజయోత్సవ సభలు నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హరీష్ రావు పర్యటించారు. భద్రాచలంలో బీఆర్ఎస్ ను గెలిపించిన ప్రజలకు, కార్యకర్తలకు హరీష్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. ‘రాష్ట్ర అప్పుల విషయంలో అసెంబ్లీలోను, నిన్న ఆదిలాబాద్ సభలో ముఖ్యమంత్రి గారు అబద్ధాలు మాట్లాడుతున్నారు. మూడు లక్షల కోట్ల అప్పులు ఉంటే ఏడు లక్షల కోట్లుగా ప్రచారం చేస్తున్నారు. మీరు వచ్చి రెండు నెలల్లో 14,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. జూట మాటలు చెప్పి అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేం ఏం చేశామో గ్రామాలకు వెళ్లి చూస్తే కనపడుతుంది. అదిలాబాదులో నాలుగు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఆదిలాబాద్ లో లంబాడి తండాలను , గిరిజన గుడాలను గ్రామపంచాయతీలో చేసింది బీఆర్ఎస్ పార్టీ.‌

మీ కళ్ళకు పసికలు వస్తే ఏమీ కనపడదు. ముఖ్యమంత్రి భాష సంస్కారహీనంగా, అసభ్యంగా అనాగరికంగా ఉన్నది. భారత దేశంలో ఇంత అనాగరికమైన, సంస్కారహీనమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే. ఈ రాష్ట్రం పరువు తీసే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు మీరు మీ ముఖ్యమంత్రి రేవంత్ కు బుద్ధి చెప్పండి . నాలుగు మంచి మాటలు మాట్లాడించేలా నీతి బోధ చేయండి. రేవంత్ రెడ్డి వి ఒక ముఖ్యమంత్రి స్థాయి మాటలే కాదు. 2,000 రూపాయలు కూడా ఇవ్వలేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. డిసెంబర్ లో 4, 000 పెన్షన్ ఇస్తాను అన్నాడు డిసెంబర్, జనవరి ఫిబ్రవరి పాయే ఇదేనా మార్పు అంటే. అయ్యా భట్టీ గారు మీరు ఆర్థిక మంత్రి ఎందుకు పెన్షన్ రాలేదో చెప్పాలి..? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏమిటి..? పెన్షన్ డబ్బులు కూడా ఇవ్వలేకపోవడమే మార్పా అని నేను అడుగుతున్నాను.

కెసిఆర్ హయాంలో 24 గంటలు నీళ్ళు పారాయి , ఇవాళ అందడం లేదు. రాష్ట్రంలో కరెంటు తిరోగమనం లో ప్రయాణిస్తున్నది. ఉదయం ఆటో కార్మికులు కలిశారు. అన్నా మమ్మల్ని కాపాడండి అని వేడుకున్నారు. తమ జీవితాలపై ఈ ప్రభుత్వాన్ని నిలదీయమని ఆటో డ్రైవర్లు వేడుకుంటున్నారు. ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లను రోడ్డు మీద తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆటో డ్రైవర్లకు నెల కు పదివేలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. కేసీఆర్ ఉన్నప్పుడు ఏనాడైనా ఫిబ్రవరి దాకా రైతుబంధు పడకుండా ఉందా..? ఫిబ్రవరి వచ్చినా రైతుబంధు వేయకపోవడంమేనా మీరు తీసుకొచ్చిన మార్పు.‌ ప్రాజెక్టులను కేంద్రంకు అప్పజెప్పి రాష్ట్రానికి అధికారం లేకుండా చేశారు. మీరు చేసిన పని వల్ల సాగర్ ఎడమ కాలవ ఎండిపోతుంది. నీళ్లు రాకుండా పోతాయి. ఇక రేవంత్ రెడ్డి తల కిందులుగా తపస్సు చేసిన రాహుల్ ప్రదాని కాలేడు. బీజేపీ ని నిలువరించే శక్తి ప్రాంతీయ పార్టీలదే అని అన్నారు హరీష్ రావు.

 

 

Latest News

More Articles