Sunday, April 28, 2024

విమర్శకులకు చెంపపెట్టు.. శ్రీనివాస్ గౌడ్ కి దక్కిన న్యాయం

spot_img

బీఆర్ఎస్ ప్రభుత్వంలో బలహీనవర్గాల్లో మంచి పేరు దక్కించుకున్న నేత మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌. బీసీలకు పెద్ద పీట వేయటమే కాకుండా ఉద్యమనేతలకు సమ ప్రాధాన్యత ఇస్తూ శ్రీనివాస్ గౌడ్ ని మంత్రిని కూడా చేశారు కేసీఆర్. ఇక అప్పటి నుండి శ్రీనివాస్ గౌడ్ పై ఏదోరకంగా దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు కొందరు. వారికి చెంపపెట్టులాంటి వార్త ఒకటి నేడు కోర్టు వెలువరించింది. తాజాగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనని ఎలాగైనా ప్రజాప్రతినిధిగా తప్పించాలంటూ చేస్తున్న ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఆయన ఎన్నికకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక చెల్లదంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి 219లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దానిని కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. 2018లో శ్రీనివాస్‌ గౌడ్‌ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు సమాచారం అందించారని రాఘవేంద్రరాజు పిటిషన్‌ వేశారు. ఎన్నికల అఫిడవిట్‌ను ఒకసారి రిటర్నింగ్‌ అధికారికి సమర్పించి.. మళ్లీ వెనక్కి తీసుకుని సవరించి అందజేశారని అందులో పేర్కొన్నారు. ఇది చట్టవిరుద్ధమని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. తీర్పులను నేటికి వాయిదా వేసింది. దీంతో నేడు తీర్పును వెలువరించింది.

Latest News

More Articles