Sunday, April 28, 2024

అమెరికాలో హైదరాబాద్‌ విద్యార్థి కిడ్నాప్: డబ్బులు ఇవ్వకుంటే కిడ్నీ అమ్మేస్తామని బెదిరింపులు

spot_img

అమెరికా లో ఈ మధ్య కాలంలో తెలుగు విద్యార్థుల హత్యలు, కిడ్నాప్ లు ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలోనే మరో మరో తెలుగు విద్యార్థి కన్పించకుండా పోయాడు. హైదరాబాద్‌ కు చెందిన అబ్దుల్‌ మహమ్మద్‌ అనే 25 ఏళ్ల విద్యార్థి గత రెండు వారాలుగా కనిపించకుండా పోయాడు. అయితే, అబ్దుల్‌ను కిడ్నాప్‌ చేశామంటూ గుర్తు తెలియని వ్యక్తులు హైదరాబాద్‌లోని విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్‌ చేశారు. 1,200 డాలర్లు ఇస్తే అబ్దుల్‌ను సురక్షితంగా విడిచిపెడతామని బెదిరించారు.

హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్‌ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ క్లేవ్‌ల్యాండ్‌ యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ చదువుతున్నాడు. అయితే, అతడు మార్చి 7వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో అమెరికాలోని అబ్దుల్‌ బంధువులు మార్చి 8న క్లీవ్‌ల్యాండ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విద్యార్థి కోసం లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. అబ్దుల్‌ను గుర్తించడంలో సహాయం కోరుతూ అతడి కుటుంబం మార్చి 18న చికాగోలోని భారత కాన్సులేట్‌ను కూడా ఆశ్రయించారు.

ఇంతలోనే హైదరాబాద్‌లో ఉన్న అబ్దుల్‌ తండ్రి అహ్మద్‌ సలీమ్‌కు గుర్తుతెలియని నంబర్‌ నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. తాము అబ్దుల్‌ను కిడ్నాప్‌ చేశామని, అతన్ని విడిచిపెట్టాలంటే 1,200 డాలర్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేదంటే అబ్దుల్ కిడ్నీ అమ్మేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. క్లీవ్‌ల్యాండ్ పోలీసులు కూడా కేసు నమోదు చేసి ..అబ్దుల్ అదృశ్యంపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: రైతులకు నీళ్లు ఇచ్చి.. గతంలో ఏమన్నా తప్పులు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోండి

Latest News

More Articles