Saturday, April 27, 2024

నా దగ్గర అంత డబ్బులేకే పోటీ చేయట్లేదు.!

spot_img

లోక సభ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలుచేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు తన దగ్గర లేవని..అందుకే పార్టీ ప్రతిపాదనను తిరస్కరించానని చెప్పుకొచ్చారు. ఏపీ లేదా తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అవకాశం కల్పించినట్లు చెప్పారు.

ఒక వారం, పది రోజులు ఆలోచించిన తర్వాత కుదరకపోవచ్చని చెప్పానని , ఎన్నికల్లో పోటీ చేసేందుకు నా దగ్గర అంత డబ్బు లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ లేదా తమిళనాడు..ఏదైనా నాకో సమస్య ఉందని..అక్కడ గెలుపునకు కులం, మతం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. అవన్నీ చేయలేనని..అందుకే పోటీ చేయనని చెప్పాను. వారు నా వాదనను అంగీకరించడం గొప్ప విషయమన్నారు. అందుకే నేను ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు.ఓ జాతీయ వార్త ఛానల్ నిర్వహించిన సదస్సులో ఈ విషయాన్ని వెల్లడించారు. పార్టీకి చెందిన ఇతర అభ్యర్థుల కోసం ఎన్నికల్లో తాను ప్రచారం చేస్తానని చెప్పారు.

దేశ ఆర్ధికమంత్రిగా ఉన్న వ్యక్తి దగ్గర ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు లేవా అని అడిగిన్ ప్రశ్నకు నిర్మలా సీతారామన్ సమాధానం ఇస్తూ..నా జీతం, నా సంపద, నా పొదుపు మాత్రమే నావి అన్నారు. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మాత్రం నాది కాదని సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉండే రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్ అనేక మంది బీజేపీ నేతలకు లోకసభ ఎన్నికల బరిలో ఆపార్టీ దింపుతోంది. పీయుష్ గోయల్, భూపేంద్ర యాదవ్, చంద్రశేఖర్, మన్ సుఖ్ మాండవీయ, జ్యోతిరాదిత్య సింధియా వంటి నేతలు ఈ జాబితాలో ఉన్నారు. నిర్మలా సీతారామన్ కర్నాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తోన్న విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి: ఉప్పల్లో హైదరాబాద్ రికార్డుల సునామీ..మ్యాచ్ ఒక్కటే..పరుగులు 523..సిక్స్ లు 38.!

Latest News

More Articles