Saturday, April 27, 2024

ఉప్పల్లో హైదరాబాద్ రికార్డుల సునామీ..మ్యాచ్ ఒక్కటే..పరుగులు 523..సిక్స్ లు 38.!

spot_img

బుధవారం ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో హైదరాబాద్ సునామీలా విజ్రుంభించింది. ముంబయి ఇండియన్స్ ను కోల్కోలేని దెబ్బకొట్టింది. హైదరాబాద్ ఆటగాళ్ల ప్రదర్శనకు ముంబై చేతులెత్తిసింది. ఫోర్లు, సిక్సులతో గ్యాలరీ కూర్చున్న ప్రేక్షకులు తడిసిముద్దయ్యారు. ఒకడు ఉరుములా చెలరేగుతే.మరొకడు పిడుగుల గర్జించాడు. ఆకలితో ఉన్న సింహాంలా ఊచకోత కోసారు సన్ రైజర్స్ బ్యాటర్లు. ట్రావిస్ హెడ్ 24 బంతుల్లో 62 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ 23 బంతుల్లో 63 పరుగులు చేశాడు. హెన్రిన్ క్లాసెస్ 34 బంతుల్లో 80 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఉప్పల్ స్టేడియంలో తమ ఇన్నింగ్స్ తో పరుగుల వరదను చూపించారు. అయినా కూడా ముంబయి బ్యాటర్లు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తమ కష్టానంతా చూపించారు. శాయశక్తులా గట్టిగా పోరాడారు. ధనాధన్ ఇన్నింగ్స్ తో సన్ రైజర్స్ ఒక్కింత టెన్షన్ పెట్టించారు. కానీ చివరి విజయం హైదారాబాద్ నే వరించింది. 277 హైదరాబాద్ చేస్తే…246 పరుగులు ముంబై చేసింది. ఈ మ్యాచులో పలు రికార్డులు కూడా నమోదవ్వడం గమనార్హం. అవేంటో చూద్దాం.


-ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసి హైదారాబాద్ రికార్డు క్రియేట్ చేసింది.

-ఈ మ్యాచ్​ తొలి 10 ఓవర్లలో సన్‌రైజర్స్‌ స్కోరు 148 సాధించింది. దీంతో గతంలో 2014లో పంజాబ్‌, 2021లో ముంబయి చేసిన 131 పరుగుల రికార్డు బ్రేక్ చేసింది.

-ఈ మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్​ సాధించిన స్కోరు 277/3. ఐపీఎల్‌ చరిత్రలోనే ఓ జట్టు సాధించిన అత్యధిక స్కోరూ ఇదే.

– గతంలో 2013లో పుణె వారియర్స్‌పై ఆర్సీబీ సాధించిన 263/5 రికార్డును బ్రేక్ చేశారు. పురుషుల టీ20ల్లో నేపాల్‌ (314/3), అఫ్గానిస్థాన్‌ (278/3) టీమ్స్​ మాత్రమే సన్‌రైజర్స్‌ కంటే ముందున్నాయి.

-హెడ్‌- అభిషేక్‌ ద్వయం ఓ రికార్డ్ సాధించింది. ఐపీఎల్​లోని ఒకే మ్యాచులో ఒకే జట్టు నుంచి 20 బంతుల్లోగా హాఫ్​ సెంచరీలు తొలి ద్వయం గా నిలిచింది.

-ఈ మ్యాచ్‌లో మొత్తం సిక్సర్ల సంఖ్య 38. ముందు ఓ ఐపీఎల్‌ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు రికార్డు 33 రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు పేరిటి ఉంటే..ఇప్పుడది బద్దలయ్యింది.

-ఈ మ్యాచ్​లో ముంబై పేసర్‌ మపాక సమర్పించుకున్న పరుగులు 66. ఐపీఎల్‌ అరంగేట్ర మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చింది అతడే.

ఇది కూడా చదవండి:టికెట్ నిరాకరించడంతో విషం తాగిన ఎంపీ..చికిత్స పొందుతూ మృతి.!

Latest News

More Articles