Sunday, April 28, 2024

ఉపాధి హామీ కూలీల రోజువారీ వేతనంపై కీలక అప్ డేట్..!

spot_img

గ్రామీణ ప్రాంతాల్లో నివసించే నిరుపేదలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవాలన్న ఉద్దేశ్యంతో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. పేదలకు ఏడాదికి 100రోజుల పనిని కల్పించడం ద్వారా సామాజిక ఆహార భద్రతను పెంపొందించడం వంటి లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. 25వ తేదీ ఆగస్టు 2005లో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటికీ అమలు చేస్తోంది. ప్రతి ఆర్థిక ఏడాదిలో నైపుణ్యము లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామ పరిధిలో వందరోజుల పని దినాలను కనీసం వేతనం ఇచ్చే హామీ ఇస్తూ ఈ పథకాన్ని తీసుకువచ్చింది ప్రభుత్వం.

ఈ స్కీం ప్రారంభించిన మొదట్లో  కూలీలకు ఇచ్చే దినసరి వేతనం రూ. 87.50గా ఉండేది. ప్రస్తుతం 272రూపాయలు చెల్లిస్తున్నారు.  తాజాగా కొత్త ఆర్థిక ఏడాదికి గాను ఏపీలోని కూలీలందరికీ దీనిపై మరో రూ. 28జోడించి ఇస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఏప్రిల్ నుంచి  కొత్త ఆర్థిక ఏడాది ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏపీలో  జాతీయ గ్రామీణ ఉపాధీ హామీ పథకం కూలీల కనీస వేతనం రూ. 300గా కేంద్రం నిర్ణయించింది. ఈ వార్త తో కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మార్చి, ఏప్రిల్, మే 3 నెలలపాటు ఉపాధి హామీ పనులు చేసేందుకు కూలీలు ఆసక్తి కనబర్చుతున్నారు. ఈ క్రమంలో కూలీలు ఉదయం, సాయంత్రం రెండు పూటలా పనులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ పథకం అమలు తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. వ్యవసాయ కూలీలకు ఉపాధిపై భరోసా ఇవ్వడమే కాకుండా ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లడం కూడా తగ్గింది.

ఇది కూడా చదవండి: ఈస్టర్ వేడుక​లో..లోయలో పడిన బస్సు..45మంది భక్తులు మృతి.!

Latest News

More Articles