Sunday, April 28, 2024

మా నాన్నకు జైల్లో స్లో పాయిజన్ ఇచ్చారు.!

spot_img

45 ఏళ్ల నేర చరిత్ర కలిగిన యూపీ మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మరణించాడు. ముఖ్తార్ అన్సారీ బండా జైలులో వాంతులు చేసుకోవడంతో ఆసుపత్రిలో చేర్పించారు అధికారులు. చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో గురువారం సాయంత్రం మరణించాడు. ఈరోజు కుటుంబీకుల సమక్షంలో వైద్యుల బృందం ముఖ్తార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనుంది. ముఖ్తార్ పోస్ట్‌మార్టం వీడియో తీయనున్నారు. పోస్టుమార్టం అనంతరం ముఖ్తార్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.

ఈ నేపథ్యంలో ముఖ్తార్ అన్సారీ చిన్న కుమారుడు సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రికి జైళ్లో స్లో పాయిజన్ ఇచ్చారంటూ ఆరోపించాారు. మార్చి 19న ముఖ్తార్ కు విషప్రయోగం జరిగిందని..ఆ తర్వాతే ఆయన ఆరోగ్యం క్షిణించిందని ఉమర్ ఆరోపించాడు. మూడు రోజుల క్రితం కూడా ముఖ్తార్ ఆసుపత్రిలో చేరినట్లు చెప్పాడు. వైద్యులు ఒత్తిడితో పనిచేస్తున్నారని ఉమర్ ఆరోపించారు. ముఖ్తార్ కు సరైన వైద్యం అందకనే మరణించినట్లు వాపోయాడు. కాగా ముఖ్తార్ మృతదేహాన్ని ఘాజీపూర్‌కు తీసుకువెళ్లనున్నారు. అక్కడ మహ్మదాబాద్‌లోని అతని పూర్వీకుల స్మశానవాటికలో అంత్యక్రియలు చేయనున్నారు.

గురువారం సాయంత్రం 8 గంటల ప్రాంతంలో మాఫియా ముఖ్తార్ జైలులో వాంతులు చేసుకుంటూ టాయిలెట్‌లో అపస్మారక స్థితిలో పడిపోయాడు. వెంటనే అతడిని రాణి దుర్గావతి మెడికల్ కాలేజీకి తరలించగా అక్కడ వైద్యుల బృందం చికిత్స చేశారు. వైద్యుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో రాత్రి 10.30 గంటలకు ముఖ్తార్ అన్సారీ మృతి చెందినట్లు వెల్లడించారు. ముఖ్తార్ మరణ వార్త తెలియగానే యూపీ వ్యాప్తంగా డజనుకు పైగా జిల్లాల్లో అలర్ట్ ప్రకటించారు. పోలీసులు వీధుల్లో పెట్రోలింగ్ ప్రారంభించారు. లక్నోలోని సీఎం నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.

ఇది కూడా చదవండి: ఈస్టర్ వేడుక​లో..లోయలో పడిన బస్సు..45మంది భక్తులు మృతి.!

Latest News

More Articles