Monday, May 6, 2024

మే 24 నుంచి ఇంట‌ర్ అడ్వాన్స్ డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు

spot_img

తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాలు ఇవాళ(బుధవారం) విడుద‌లైయ్యాయి. ఫ‌స్టియ‌ర్‌లో 60.01 శాతం, సెకండియ‌ర్‌లో 64.19 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్‌లో బాలిక‌లు 68.35 శాతం ఉత్తీర్ణ‌త సాధించ‌గా, బాలురు 51.50 శాతం న‌మోదు చేశారు. ఇక సెకండియ‌ర్‌లో బాలిక‌లు 72.53 శాతం ఉత్తీర్ణ‌త సాధించ‌గా, బాలురు 56.10 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. గ‌తేడాది ఇంట‌ర్ ఫ‌లితాల్లో ఫ‌స్టియ‌ర్‌లో 62.85 శాతం, సెకండియ‌ర్‌లో 67.27 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. అంటే 2023 ఫ‌లితాల‌తో పోల్చితే ఈ ఏడాది ఉత్తీర్ణ‌త శాతం స్వ‌ల్పంగా త‌గ్గింది.

అయితే ఇంట‌ర్‌ ఫ‌లితాల్లో ఫెయిలైన వారికి మే 24 నుంచి అడ్వాన్స్ డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఫ‌స్టియ‌ర్‌కు ఉద‌యం 9 నుంచి మ‌. 12 గంట‌ల వ‌ర‌కు సెకండియ‌ర్ విద్యార్థుల‌కు మ‌. 2.30 నుంచి సాయంత్రం 5.30 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. అడ్వాన్స్ డ్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లకు సంబంధించిన ప‌రీక్ష ఫీజును ఏప్రిల్ 25 నుంచి మే 2వ తేదీ వ‌ర‌కు ఆయా కాలేజీల్లో స్వీక‌రించ‌నున్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేష‌న్‌కు సంబంధించి కూడా ఇదే స‌మ‌యంలో ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రీకౌంటింగ్ కోసం ఒక్కో పేప‌ర్‌కు రూ. 100, రీవెరిఫికేష‌న్‌కు ఒక్కో పేప‌ర్‌కు రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: కలెక్టర్ గా సేవ చేశా… ఎంపీగా మరింత సేవ చేస్తా

Latest News

More Articles