Sunday, April 28, 2024

ఎన్టీఆర్‎కు అరుదైన గౌరవం.. ఆ అవకాశం దక్కిన తొలి తెలుగు హీరోగా ఖ్యాతి

spot_img

‘నాటు నాటు’ పాటతో ఆస్కార్‌ అందుకొని భారతదేశ సినిమాను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రపంచానికి పరిచయం చేసింది. దేశానికి తొలి ఆస్కార్‌ను అందించిన చిత్రంగా కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చరిత్ర సృష్టించింది. ఈ సినిమాతో హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకున్నారు. కాగా.. ఇప్పుడు ఎన్టీఆర్‎కు మరో అరుదైన గౌరవం లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ సినిమాలకు, నటులకు ఇచ్చే ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు ఎంపిక కమిటీలో చోటు దక్కింది. ఈ విషయాన్ని ఆస్కార్ కమిటీ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఆ పోస్ట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇది చూసిన అభిమానులు ప్రౌడ్‌ మూమెంట్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ ఏడాది ఆస్కార్‌ కమిటీ 398 మందికి కొత్తగా ఆస్కార్‌ ప్యానెల్‌లో చోటు కల్పించింది. అందులో భారత్‌ నుంచి ఎన్టీఆర్‌ను కమిటీ సభ్యుడిగా ఆస్కార్‌ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆస్కార్‌ కమిటీ సభ్యుడిగా నియమితులైన తొలి తెలుగు హీరోగా ఎన్టీఆర్‌ ఖ్యాతి దక్కించుకున్నారు.

Read Also: తెలంగాణ ద్రోహులకు, తెలంగాణ ప్రేమికులకు మధ్య జరగబోయే ఎలక్షన్

Latest News

More Articles