Saturday, May 11, 2024

కాంగ్రెస్ లో ఫ్లెక్సీల కలకలం.. రాహుల్, ప్రియాంకలపై బీసీ సంఘాలు ఫైర్

spot_img

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీల కలకలం రేగింది. జగిత్యాల పట్టణ కేంద్రంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి వ్యతిరేకంగా పలు చోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి. బీసీ సంఘాల ఐక్య వేదిక పేరుతో ఆ ఫ్లెక్సీలు ఉండటం గమనార్హం.

75 ఏండ్లలో కాంగ్రెస్ కు సీఎం చేయడానికి బీసీ అభ్యర్థి కరువయ్యాడా అని ఫ్లెక్సీల్లో ప్రశ్నించాయి బీసీ సంఘాలు. బీసీలను కరివేపాకులా వాడుకుంటారా అని నిలదీశారు. రేపు శుక్రవారం రాహుల్ గాంధీ, ప్రియాంక పర్యటన సందర్భంగా ఫ్లెక్సీల ఏర్పాటు కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది.

More News..

Latest News

More Articles