Friday, May 10, 2024

తెలంగాణ ద్రోహులకు, తెలంగాణ ప్రేమికులకు మధ్య జరగబోయే ఎలక్షన్

spot_img

ఎన్నికలు ముగిసిన మూడు నెలలకే కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. దాంతో తెలంగాణలో కూడా కాంగ్రెస్ వస్తే కరెంటు కటకటలు తప్పవని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. ఎన్నికలకు ముందు రైతులకు 20 గంటల పాటు కరెంటు ఇస్తామని చెప్పి ఇప్పుడు 5 గంటల కరెంట్‎తో సరిపెట్టుకోండని స్వయానా కర్నాటక విద్యుత్ శాఖ మంత్రి అంటున్నారని అన్నారు. కర్నాటక మంత్రిలానే ఇక్కడ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా 3 గంటల కరెంటు సరిపోతుందని, 24 గంటల కరెంటు అనవసరమని అన్నాడని మండిపడ్డారు. కరెంటు కష్టాలు తెచ్చే కాంగ్రెస్ మనకెందుకు అని ప్రశ్నించారు. 5 గంటల… 3 గంటల పార్టీలు మనకొద్దని ప్రజలకు చెప్పారు. దేశంలో ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‎కు మద్దతుగా నిలుద్దామని సూచించారు.

ఆర్మూర్ పట్టణంలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సత్య దూరపు మాటలు మాట్లాడుతున్నారు. వారి మాటలు విని తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. మీరు పర్యటించే రాష్ట్రాల గురించి పక్కాగా తెలుసుకొని మాట్లాడాలని తెలియజేస్తున్నాను.. ఎవరో రాసిచ్చింది చదివిపోవడం కాదు. కనీసం రాసిచ్చిన దానిలో ఉన్న విషయాలు ఏంటో తెలుసుకుంటే మంచిది. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులలో అవినీతి జరిగిందని రాహుల్ మాట్లాడారు. లక్ష కోట్ల ప్రాజెక్టులలో లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందో మీరు కొంచెం ఆలోచన చేయాలి. ఓట్ల కోసం తప్పుడు మాటలు చెప్పిందే చెబితే మీకు అవమానం తప్పదు. మీరన్నట్లు అవినీతి జరిగితే ఆర్మూర్ లోని ప్రతి ఇంట్లో నీళ్ళొచ్చేవి కావు. కాంగ్రెస్ హయాంలో అవినీతి జరిగింది కాబట్టే.. ఎస్సారెస్పీ కట్టడానికి 60 ఏండ్లు తాత్సారం చేశారు. మీ తాత అయిన నెహ్రూ మొదలుపెట్టిన ప్రాజెక్టును కూడా మా నాయకుడు కేసీఆర్ పూర్తి చేశారు. ఇటువంటి చరిత్ర ఉన్న మీరు.. కేసీఆర్ మీద అవాకులుచివాకులు మాట్లాడటం హాస్పాస్పదంగా ఉంది. మీరు మొదలుపెట్టి వదిలేసిన కాలువలు, చెరువులను మేం బాగుచేసుకున్నాం. మీరు అవినీతి చేశారు కాబట్టే.. అప్పుడు రైతుల కళ్లలో నీళ్లు ఉండేవి. ఇప్పుడు మేం కష్టపడ్డాం కాబట్టి రైతుల కళ్లల్లో కాకుండా.. పొలాల్లో నీళ్లు ఉన్నాయి.

Read Also: 20 రోజుల్లో అత్తారింట్లోని ఐదుగురిని చంపిన కోడలు

ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం అంటున్నారు కదా.. మరి భూమి హక్కుదారు ఎవరు, రైతుబంధు ఎవరికి ఇవ్వాలో ఎలా తెలుస్తుంది? ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ధరణి గుల్ల కావడం ఖాయం. రైతులంటే కాంగ్రెస్ పార్టీకి ఎంత చిన్న చూపో అర్థమవుతోంది. తెలంగాణను విడగొట్టడానికి మరోసారి ప్రయత్నిస్తున్నారు. ఈ తెలంగాణ సకల జనులు కష్టపడి సాధించుకున్న ప్రజా తెలంగాణ. ప్రజలందరూ కలిసి మీ మీద కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. రేపు జరగబోయే ఎలక్షన్.. తెలంగాణ ద్రోహులకు, తెలంగాణ ప్రేమికులకు మధ్య జరగబోయే ఎలక్షన్. తెలంగాణ వద్దని, ఉద్యమం చేస్తున్న వారి మీద రైఫిల్ ఎక్కుపెట్టిన రేటేంతరెడ్డి పక్కా తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ ద్రోహి. 2004లో తెలంగాణ ఇస్తామని 10 ఏండ్లు ఆపారు. దాంతో వందలాది మంది పిల్లలు చనిపోయారు. ఆ పాపమంతా మీదే. మీరు అప్పుడే తెలంగాణ ఇచ్చి ఉంటే.. మేం ఇంకా ఎంతో అభివృద్ధి చెందే వాళ్లం. పార్లమెంటులో ఏనాడైనా తెలంగాణ హక్కుల గురించి మాట్లాడలేదు. అటువంటి కాంగ్రెస్ ఈ రోజు మంచి చేస్తాం అంటే ప్రజలు ఎలా నమ్ముతారు? అధికారంలో ఉన్న చోటా ఏం చేయలేని వాళ్లు ఇక్కడకు వచ్చి ఏం చేస్తారు? అటువంటి వాళ్ల మాటలు ఎవరూ నమ్మొద్దు’ అని కవిత అన్నారు.

Read Also: నడిరోడ్డు మీద జుట్టుపట్టుకొని కొట్టుకున్న బీజేపీ మహిళా మోర్చా నాయకులు.. వైరలవుతున్న వీడియో

Latest News

More Articles