Sunday, April 28, 2024

సైమా అవార్డ్స్‌‎లోనూ సత్తా చాటిన ‘ఆర్ఆర్ఆర్’

spot_img

సైమా అవార్డ్స్‌‎లోనూ ‘ఆర్ఆర్ఆర్’ అవార్డుల మోత మోగించింది. అటు ఆస్కార్ అవార్డుతో పాటు పలు జాతీయస్థాయి అవార్డులను కూడా అందుకుంది. తాజాగా సైమా అవార్డ్స్‎లోనూ సత్తా చాటింది. 2023 సైమా అవార్డులలో ఆరు అవార్డులను సొంతం చేసుకుంది. సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) – 2023 వేడుక దుబాయి వేదికగా శుక్రవారం రాత్రి అట్టహాసంగా మొదలైంది. సెప్టెంబరు 15, 16 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ వేడుక తొలి రోజు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన నటీనటులు హాజరయ్యారు. రెండు చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు తమ ప్రదర్శనలతో ఆహూతులను అలరించారు. సైమా అవార్డ్స్-2023లో ఉత్తమ నటుడిగా జూ. ఎన్టీఆర్‌ అవార్డు అందుకున్నారు. ‘RRR’లో ఆయన నటనకుగానూ ఈ అవార్డు వచ్చింది. అలాగే ‘ధమాకా’ హీరోయిన్ శ్రీలీల ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకుంది. ఉత్తమ పరిచయ నటిగా మృణాల్‌ ఠాకూర్‌ (సీతారామం) అవార్డు గెలుచుకుంది. ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి, ఉత్తమ చిత్రంగా సీతారామం ఎంపికయ్యాయి.

Read Also: హైదరాబాద్‎లో కాంగ్రెస్ జాతీయ నేతల స్కాంలతో పోస్టర్లు.. సోనియా, రాహుల్ సహా కీలక నేతలు

‘సైమా’ 2023 అవార్డుల విజేతలు
ఉత్తమ నటుడు: ఎన్టీఆర్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)
ఉత్తమ నటి: శ్రీలీల (ధమాకా)
ఉత్తమ దర్శకుడు: ఎస్‌.ఎస్‌.రాజమౌళి (ఆర్‌ఆర్‌ఆర్‌)
ఉత్తమ చిత్రం: సీతారామం (వైజయంతి మూవీస్‌)
ఉత్తమ సహాయ నటుడు: రానా (భీమ్లా నాయక్‌)
ఉత్తమ సహాయ నటి: సంగీత (మసూద)
ఉత్తమ విలన్‌: సుహాస్‌ (హిట్‌2)
ఉత్తమ హాస్య నటుడు: శ్రీనివాస్‌రెడ్డి (కార్తికేయ2)
ఉత్తమ పరిచయ నిర్మాత (తెలుగు): శరత్‌, అనురాగ్‌ (మేజర్‌)
ఉత్తమ పరిచయ నటి: మృణాల్‌ ఠాకూర్‌ (సీతారామం)
ఉత్తమ సంగీత దర్శకుడు: ఎం.ఎం.కీరవాణి (ఆర్‌ఆర్ఆర్‌)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్‌ కుమార్‌ (ఆర్‌ఆర్ఆర్‌)
ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్‌ (నాటు నాటు-ఆర్‌ఆర్ఆర్‌)
ఉత్తమ నేపథ్య గాయకుడు: రామ్‌ మిర్యాల (డీజే టిల్లు)
ఉత్తమ పరిచయ దర్శకుడు: మల్లిడి వశిష్ట (బింబిసార)
సెన్సేషన్‌ఆఫ్‌ ది ఇయర్‌ : నిఖిల్‌, కార్తికేయ2
ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): అడవి శేష్‌ (మేజర్‌)
ఉత్తమ నటి (క్రిటిక్స్‌): మృణాల్‌ ఠాకూర్‌ (సీతారామం)
ఫ్లిప్‌కార్ట్‌ ఫ్యాషన్‌ యూత్‌ ఐకాన్‌: శ్రుతి హాసన్‌
ప్రామిసింగ్‌ న్యూకమర్‌ (తెలుగు): బెల్లంకొండ గణేష్‌

Latest News

More Articles