Wednesday, May 1, 2024

భారీగా పెరుగుతున్న బంగారం..71వేలు దాటిన తులం ధర.!

spot_img

బంగారం ధర ఆకాశమే హద్దుగా దూసుకుపోతుంది. మరోసారి గరిష్టస్థాయికి చేరుకుంది. రోజుకొక రికార్డలు బద్దలు కొడుతున్న బంగారం ధర శనివారం మరోసారి భారీగా పెరిగి షాకిచ్చింది. రూ. 71వేలు దాటింది. అంతర్జాతీయ మార్కెట్ల అతివిలువైన లోహాల ధరలు పుంజుకోవడంతో దేశీయంగా బంగారం ధరకు రెక్కలు వచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,200 పెరిగి రూ. 64,150 నుంచి రూ. 65,350కి చేరుకుంది. 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం తులం ధర రూ. 1,310 పెరిగి రూ. 71,290కి చేరుకుంది. ఒకేరోజు ఇంతస్థాయిలో బంగారం పెరగడం విశేషం. ఢిల్లీలో తులం ధర రూ. 1,310 ఉండగా రూ. 71,440కి చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ ఉన్నా కూడా కొనుగోళ్లు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. అవసరం ఉంటేనే బంగారం కొంటున్నారని వ్యాపారులు చెబుతున్నారు.

బంగారంతోపాటు వెండి కూడా భారీగానే పెరుగుతుంది. హైదరాబాద్‌లో కిలో వెండి ఏకంగా రూ.2 వేలు పెరిగి రూ.85 వేల నుంచి రూ.87 వేలకు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ అధికంగా ఉండటమే దీనికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఢిల్లీలో వెండి రూ.83,500 వద్ద ట్రేడ్ అయ్యింది. శుక్రవారంతో పోలిస్తే రూ.1,800 పెరిగింది. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశాలున్నాయని బులియన్‌ వర్గాలు వెల్లడిస్తున్నారు. అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించనున్నట్లు సంకేతాలివ్వడం, రష్యా-ఉక్రెయిన్‌ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులతోపాటు పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం వైపు మళ్లించడంతో బంగారం ధరలు పెరుగుతున్నట్లు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై కారు బీభత్సం… ఇద్దరి దుర్మరణం

Latest News

More Articles