Thursday, May 2, 2024

లోక్‌సభ ఎన్నికల.. తొలిదశ పోలింగ్ ప్రారంభం..!

spot_img

18వ లోక్‌సభ ఎన్నికలకు ఈరోజు తొలి దశ ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. 16 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. దీంతో పాటు ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు కూడా ఓటింగ్ జరుగుతోంది. 102 స్థానాలకు గాను తొలి దశలో 1,625 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 16 కోట్ల 63 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు, కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థి కె. అన్నామలై ఓటు వేశారు.కాగా భారతదేశ ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు.అటు 100% ఓటు వేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాగ్‌పూర్ ప్రజలను కోరారు.తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ఓటింగ్‌లో కొత్త రికార్డు సృష్టించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఏ రాష్ట్రంలో ఎన్ని స్థానాలు ఉన్నాయంటే
తమిళనాడు-39, రాజస్థాన్‌-12, ఉత్తర్‌ప్రదేశ్‌-8, మధ్యప్రదేశ్‌-6, మహారాష్ట్ర, అస్సాం, ఉత్తరాఖండ్‌-5 చొప్పున, బీహార్‌-4, పశ్చిమ బెంగాల్‌-3, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపుర్‌, మేఘాలయలో- 2 చొప్పున, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం, నాగాలాండ్‌, సిక్కిం, త్రిపుర, అండమాన్‌ నికోబార్‌, జమ్ముకశ్మీర్‌, లక్షద్వీప్‌, పుదుచ్చేరిల్లో 1 స్థానం చొప్పున ఉన్నాయి.

ఇది కూడా చదవండి :రాహుల్, ప్రియాంక అమూల్ బేబీలు..సీఎం సంచలన వ్యాఖ్యలు..!

Latest News

More Articles