Thursday, May 2, 2024

మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండేకు కోవిడ్ పాజిటివ్..ఐసోలేషన్ లో చికిత్స..!!

spot_img

మహారాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ధనంజయ్ ముండేకు కోవిడ్ సోకింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రకటించారు. కరోనా కేసులు పెరుగుదల నేపథ్యంలో భయపడాల్సిన అవసరంలేదన్నారు. తమ మంత్రివర్గ సహచరుడు ధనంజయ్ ముండేకు కోవిడ్ సోకిందని అజిత్ పవార్ సోమవారం నాడు మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మంత్రి ధనంజయ్ ముండే కార్యాలయం కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఆయనకు సోకిన వైరస్ ఏంటనేది మాత్రం కూడా స్పష్టం కాలేదు.

ఈనెల 20వ తేదీని నాగ్ పూర్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాల చివరి రోజున కోవిడ్ సోకిందని ఆయన కార్యాలయం సిబ్బంది తెలిపారు. ఈనెల 21న ధనంజయ్ ముండే ఇంటికి వెళ్లి అసోలేషన్ లో ఉన్నారని మంత్రి కార్యాలయం సిబ్బంది చెప్పారు. వైద్యుల సూచనల మేరకు మంత్రి మందులు వాడుతున్నారన్నారు. తన శాఖకు సంబంధించిన కార్యకలాపాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు పలు సూచనలు, సలహాలను మంత్రి అందిస్తున్నారని సిబ్బంది తెలిపారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో కోవిడ్ కలకలం..కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..!!

Latest News

More Articles