Thursday, May 2, 2024

రష్మిక డీప్ ఫేక్ వీడియో చేసిన వ్యక్తి అరెస్ట్

spot_img

ప్రముఖ నటి రష్మిక మందన్న‘డీప్‌ఫేక్’ వీడియో కేసులో ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏఐ టెక్నాలజీతో రష్మిక ఫేక్ వీడియో సృష్టించిన వ్యక్తిని ఏపీకి చెందినవాడి పోలీసులు గుర్తించారు. దాంతో ఢిల్లీ పోలీసులు ఏపీకి వచ్చి సదరు నిందితుడిని ఏపీలో అరెస్ట్ చేశారు. గతేడాది నవంబర్ 2023లో రష్మికా మందన్నా డీప్‌ఫేక్ వీడియో వైరల్ అయింది. బ్లాక్ డ్రెస్‌లో ఉన్న బ్రిటీష్-ఇండియన్ ఇన్‌ఫ్లూయెన్సర్ జారా పటేల్ వీడియోకి రష్మికా ముఖంతో మార్ఫింగ్ చేశారు. దీనిపై ఢిల్లీ పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్, 1860లోని సెక్షన్లు 465 (ఫోర్జరీ) మరియు 469 (పరువుకు భంగం కలిగించడం) మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోని సెక్షన్లు 66C (ఐడెంటిటీ థెఫ్ట్) మరియు 66E (గోప్యతా ఉల్లంఘన) కింద కేసు నమోదు చేశారు.

Read Also: వీధి వ్యాపారులను వేధిస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలె..

Latest News

More Articles