Thursday, May 2, 2024

తెలంగాణకు ఐదు రోజులపాటు వర్ష సూచన

spot_img

తెలంగాణలో తీవ్ర ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే విషయాన్ని చెప్పింది హైదరాబాద్ వాతావరణ శాఖ. వచ్చే ఐదు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 24 గంటల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చంది. అలాగే మరికొన్ని జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు వచ్చే ఐదు రోజులపాటు ఉండే వాతావరణ పరిస్థితులపై ఇవాళ(శుక్రవారం) బులెటిన్ విడుదల చేసింది.

కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడా వడగాడ్పులు వీచే అవకాశం. రాబోయే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ వరకు పెరగొచ్చని తెలిపింది వాతావరణ శాఖ.

రేపు (శనివారం)నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో శనివారం అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవొచ్చు.

21, 22, 23 తేదీల్లో ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ , నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడొచ్చు. మిగతా రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.

ఇది కూడా చదవండి: ఎన్నికల వేళ కాషాయంలోకి దూరదర్శన్ లోగో.. విపక్షాల ఆగ్రహం

Latest News

More Articles