Sunday, April 28, 2024

హాలీవుడ్‌, బాలీవుడ్‌‎పై మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

spot_img

హాలీవుడ్‌, బాలీవుడ్‌‎పై మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఐదేళ్లలో హాలీవుడ్‌, బాలీవుడ్‌ను తెలుగు ప్రజలే శాసిస్తారని ఆయన అన్నారు. బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్, కన్నడ భామ రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘యానిమల్’. ఈ సినిమాలో బాబీ డియోల్‌, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా, కృషన్‌ కుమార్‌, మురద్‌ ఖేతని నిర్మిస్తున్నారు. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్‌ 1న హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను సోమవారం హైద‌రాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించారు.

Read Also: కాంగ్రెస్ మొసలి కన్నీరు నమ్మితే వచ్చే ఐదేళ్లు రక్త కన్నీరే

ఈ వేడుకకు టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళి, స్టార్‌ నటుడు మహేశ్‌బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సైతం స్పెషల్ గెస్ట్‎గా వచ్చారు. ఈ సందర్భంగా అద్భుతమైన స్పీచ్‌తో ఆకట్టుకున్నారు. మంత్రి మాట్లాడుతూ.. ‘వచ్చే ఐదేళ్లలో హాలీవుడ్‌, బాలీవుడ్‌ను తెలుగు ప్రజలే శాసిస్తారు. రణ్‌బీర్‌ కపూర్‌ మీరు కూడా ఏడాది తర్వాత హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అవుతారు. ఎందుకంటే ముంబై పాతబడిపోయింది. బెంగళూరు ట్రాఫిక్‌ ఎక్కువ. హైదరాబాద్ మాత్రమే అనువైన నగరం. మా తెలుగు వాళ్లు చాలా స్మార్ట్‌. మా తెలుగు దర్శకుడు రాజమౌళి, నిర్మాత దిల్‌ రాజ్‌ చాలా తెలివైన వాళ్లు. వారి సరసన ఇప్పుడు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా కూడా చేరాడు. రష్మిక చాలా తెలివైనది.. పుష్పతో క్రేజ్ పెరిగిపోయింది. ఇకపై బాలీవుడ్‌, హాలీవుడ్‌ను తెలుగు వాళ్లే శాసిస్తారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో నాలుగుసార్లు అశ్వమేధ యాగం జరిగింది. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారు. ఇక్కడ ఏ సినిమా రిలీజ్ అయినా కూడా రూ.500 కోట్లు కలెక్షన్స్ సాధిస్తాయి. పక్కా.. ఈ సినిమా సూపర్ హిట్’ అంటూ చెప్పుకొచ్చారు.

Latest News

More Articles