Saturday, April 27, 2024

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఊసేది

spot_img

ప్రధాని మోడీ పాలమూరు పర్యటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. మోడీ పాలమూరు స్పీచ్ లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఊసేది ? 2014 ఎన్నికల ప్రచార హామీ మోసపూరితమేనా ? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ప్రకటించక పోవడం పాలమూరు ప్రజలను వంచించడమే. కృష్ణా జలాలలో తెలంగాణ వాటా గురించి ప్రధాని ఎందుకు మాట్లాడలేదు. రూ.13,500 కోట్ల టోల్ రహదారులు ఏ ప్రజల ప్రయోజనాల కోసం. బీజేపీ హయాంలో రహదారుల మీద టోల్ వసూలు సామాన్య ప్రజలకు భారంగా మారింది. టోల్ ట్యాక్స్ వసూలు చేసే రహదారులు నిర్మించి అభివృద్ది చేశాం అని చెప్పుకోవడం ఆశ్చర్యకరం.

బీహార్ ఎన్నికలలో చేసిన ప్రధాని లక్షన్నర కోట్ల హామీలకు ఇంత వరకు దిక్కు లేదు. 2019 ఎన్నికల పసుపు బోర్డు హామీ మీకు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా ? మోసపూరిత హామీల్లో మోడీది అందెవేసిన చేయి. పాలమూరుకు వచ్చి పసుపుబోర్డు, గిరిజన విశ్వవిద్యాలయం ప్రకటించడం బీజేపీ అవగాహనా రాహిత్యానికి నిదర్శనం. వీటివల్ల పాలమూరు జిల్లాకు కలిగే ప్రయోజనాలు ఏంటి ? పాలమూరు రంగారెడ్డిని విస్మరించడం తెలంగాణ బీజేపీ నేతల అసమర్థతకు నిదర్శనం. పాలమూరు ప్రజలకు బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలి. పాలమూరు ప్రయోజనాలు కాపాడలేని బీజేపీ నేతలు వెంటనే పార్టీకి రాజీనామా చేయాలి’ అని అన్నారు మంత్రి సింగిరెడ్డి.

 

Latest News

More Articles