Sunday, April 28, 2024

నేటి కలియుగంలో జన్మించిన కలియుగ పురుషుడు సిఎం కేసీఆర్

spot_img

పెద్దపల్లి జిల్లా: నేటి కలియుగంలో జన్మించిన కలియుగ పురుషుడు సిఎం కేసీఆర్ అని రామగుండం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆనాడు రాముణ్ణి మనం చూడలేదని, ఈ నాటి రాముడు కేసీఆర్ ను చూస్తున్నామని ఎమోషనల్ అయ్యారు. చరిత్ర నేర్పిన గాయాల నుండి తెలంగాణ గేయమై ఉద్భవించిన నాయకుడు సిఎం కేసీఆర్ అని కొనియాడారు.  రామగుండం నియోజక వర్గం గోదావరిఖని సింగరేణి స్టేడియంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Also Read.. ఉన్న తెలంగాణ ఊడగొట్టి, సింగరేణిని నాశనం చేసింది.. కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ ఫైర్

ఇక్కడి సింగరేణి కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు.గత పాలకులు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలు ఇచ్చిన నేత సిఎం కేసీఆర్. కాలుష్యానికి నిలయంగా ఉన్న ఈ ప్రాంతంలో మెరుగైన వైద్య సేవలు అందాలని మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన సిఎం కేసీఆర్ కు రుణ పడి ఉంటామన్నారు. సివిల్ జడ్జ్ కోర్టు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నామని, రాయదండిలో 1800 ఎకరాల కుర్జూ ఖమ్మీ భూములకు పట్టాలు ఇచ్చుకున్నామని తెలిపారు. రామగుండంలో గోదావరికి కి కర కట్ట నిర్మించాలని కోరుతున్నాం. కుటీర పరిశ్రమలు కావాలి, కాంట్రాక్టు కార్మికులు పర్మినెంట్ కావాలని కోరుతున్నామని పేర్కొన్నారు.

Latest News

More Articles