Sunday, April 28, 2024

ఉన్న తెలంగాణ ఊడగొట్టి, సింగరేణిని నాశనం చేసింది.. కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ ఫైర్

spot_img

పెద్దపల్లి జిల్లా: ఎన్నికలు వచ్చినపుడు ఆగమాగం కావద్దు అభ్యర్థి గుణగణాలు, పార్టీ  చూసి ఓటు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. అభ్యర్థుల వెనుకున్న పార్టీల చరిత్రను చూడాలన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని, యాభై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ దేశాన్ని నాశనం చేసిందని విమర్శించారు. రామగుండం నియోజక వర్గం గోదావరిఖని సింగరేణి స్టేడియంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో సిఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మేల్యే కోరు కంటి చందర్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Also Read.. క‌ల్తీ నెయ్యి ఫ్యాక్ట‌రీ గుట్టు ర‌ట్టు: పాపుల‌ర్ బ్రాండ్ల లేబుల్స్ సీజ్‌

ఉన్న తెలంగాణ ఊడగొట్టింది కాంగ్రెస్సే. సింగరేణిని నాశనం చేసిందే కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు. చేతకాక  సింగరేణి నీ కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా పుట్టించిందే కాంగ్రెస్ అని పేర్కొన్నారు. కాంగ్రెసోళ్లు తీసేసిన డిఫెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించి 15 వేల మంది కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నామన్నారు. ప్రొఫెసర్ జీ ఆర్ రెడ్డి, ఇతర ఆర్థిక వేత్తలతో చర్చించి తెలంగాణను బాగు చేసుకున్నామని తెలిపారు.

Also Read.. సింగ‌రేణి కార్మికులకు ఇన్‌క‌మ్ ట్యాక్స్ ర‌ద్దు చేయమంటే.. మోదీ చేస్తలేడు

రైతు బంధు పుట్టించిందే బీఆర్ఎస్. 3 గంటల కరెంట్ చాలని రేవంత్ రెడ్డి అంటుండు. 3 గంటల కరెంట్ సరిపోతుందా? ధరణి వచ్చాకే రైతుల చేతికి భూమి హక్కులు వచ్చాయి. ధరణి బంగాళాఖాతంలో వేయాలని అంటున్నారు, వాళ్ళనే బంగాళాఖాతం లో వేద్దామని పిలుపునిచ్చారు. సింగరేణి కార్మికులకు లాభాల వాటా పెంచుకున్నాం. లాభాల వాటా, దీపావళి బోనస్ కలిపి వెయ్యి కోట్లు ఇచ్చాం. కార్మికులకు వేతనాలు ట్యాక్స్ మినహాయింపు చేస్తామన్నారు.

Also Read.. గోదావ‌రిపై క‌ర‌క‌ట్ట క‌ట్టి మంచిర్యాల‌కు వ‌ర‌ద‌ నీరు రాకుండా చేసే బాధ్య‌త నాది

సింగరేణి తెలంగాణ కొంగు బంగారం. సింగరేణి నీ మరింత ముందుకు తీసుకుపోతామన్నారు. చందర్ ఉద్యమ సమయంలో 74 రోజులు జైల్లో ఉన్నాడు. రామగుండంలో మరిన్ని పరిశ్రమలు తీసుకువస్తామని, కోరు కంటి చందర్ ను బారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు.

Latest News

More Articles