Saturday, April 27, 2024

క్వింటాల్ కు 500 బోనస్ ఇచ్చి వరి కొనుగోలు చేయాలి

spot_img

ఎన్నికల ముందు కాంగ్రెస్  ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం క్వింటాల్ కు 500 బోనస్ ఇచ్చి వరి కొనుగోలు చేయాలన్నారు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రస్తుతం 2200 ధర ఉంది ..500 రూపాయల బోనస్ తో క్వింటాల్ కు 2700 రూపాయలు రైతులకు చెల్లించాలి..లేకుంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఆడగొద్దన్నారు.

వరికి 500 రూపాయల బోనస్ ఇచ్చి క్వింటాలు వరి 2700 కు కొనుగోలు చేయాలని ,కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే రైతుల దగ్గర ప్రతి గింజ కొనాలని డిమాండ్ చేస్తూ భీంగల్ మండల కేంద్రంలో BRS పార్టీ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన రైతుల పక్షాన పోరుబాట కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ప్రశాంత్ రెడ్డి.. మా ప్రభుత్వ హయాంలో జిల్లాలో 490,బాల్కొండ నియోజకవర్గంలో 100 కు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసాం. వరి కోతలు పూర్తి అవుతున్నాయి. కల్లాల పైకి వరి కుప్పలు చేరాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ గ్రామానా వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. భీంగల్ లాంటి ప్రాంతంలో చాలా మంది రైతులు ప్రవేట్ దళారులకు ఇప్పటికే వరి క్వింటాల్ కు 2200 లకు అమ్మేశారు. ఆ రైతులందరికీ కూడా 500 బోనస్ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవర్చమంటే,పేగులు మెడలో వేసుకుంటా,కత్తెర జేబులో పెట్టుకొని తిరుగుత,మానవ బాంబుల మైతా అని ఏవేవో మాటలు మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి మీరు సీఎం అని గుర్తు పెట్టుకోండి. చిల్లర మాటలు మానేసి ఇచ్చిన హామీలు నెరవేర్చండని అన్నారు.

రాష్ట్రంలో అందరిని బెదిరించి కమిషన్ లు వసూలు చేసి కేంద్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి డబ్బులు పంపడం తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవర్చటం లేదు. అధికారంలో కి వచ్చిన 110 రోజుల్లో 13 సార్లు ఢిల్లీ కి వెళ్లోచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. పైన రేవంత్ రెడ్డి అలా ఉంటే కింద నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు ఇంకోలా తయారయ్యారు. మండలాల్లో అర్రస్ పాడినట్టు ఆఫీస్ లు పంచుకొని అక్రమ సంపాదన కి తెరలేపారన్నారు. మండల ఆఫీస్ ఒకరు ఎంపీడీఓ ఆఫీస్ ఒకరు పోలీస్ స్టేషన్ ఒకరు ఇలా పంచుకొని పైరవీలు చేస్తూ డబ్బుల సంపాదన తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోవటం లేదని విమర్శించారు.

ఒకరిద్దరిని బెదిరించో లేక కొందరు స్వార్థం కోసం పార్టీ మారితే బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నష్టం ఎం లేదన్నారు ప్రశాంత్ రెడ్డి. ఆణిముత్యలాంటి,నికార్సయిన కార్యకర్తలు నాతో,కేసీఆర్ తోనే ఉంటారు,ఎక్కడికి పోరని అన్నారు. ఉన్నవాళ్ళమే మీ ప్రభుత్వం హామీలు అమలు చేసేలా మెడలు వంచుతాం.. ప్రజల పక్షాన పోరాడుతాం అన్నారు. రైతులు ప్రజలు గమనించాలి..ఎన్నికల ముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు  సక్రమంగా అమలు చేయటం లేదు. ఇక ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నాక ఇచ్చిన హామీలు ఆటకెక్కిస్తారని తెలిపారు. ఈ ఎంపీ ఎన్నికల్లో ఓట్లతో మనం కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబితేనే వారు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అన్న భయం ఉంటుందని అన్నారు. BRS పార్టీ రైతుల పక్షాన ప్రజల పక్షాన హామీలు అమలు అయ్యే వరకు పోరాటాలు చేస్తుంది. మీరు కూడా గ్రామాల్లో ఎక్కడికక్కడ హామీల అమలు కోసం కాంగ్రెస్ నాయకత్వాన్ని నిలదీయాలి అని సూచించారు ప్రశాంత్ రెడ్డి.

ఇది కూడా చదవండి: ఆస్తులను కాపాడుకునేందుకు వివేక్ ఎన్నిసార్లైనా..ఎన్నిపార్టీలైనా మారుతారు

Latest News

More Articles