Saturday, April 27, 2024

ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండోర్‌కు మళ్లిన ఇండిగో విమానం

spot_img

విమానం గాలిలో ఎగురుతుండగా ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఇండిగో పైలట్లు సానుకూలంగా స్పందించారు. ప్రయాణికుడికి మెడికల్‌ ఎమర్జెన్సీ నేపథ్యంలో ఆ విమానాన్ని ఇండోర్‌కు మళ్లించారు. ఇవాళ(శుక్రవారం) ఇండిగోకు చెందిన 6ఈ-178 విమానం పాట్నా నుంచి అహ్మదాబాద్‌కు బయలుదేరింది. అయితే విమానం గాలిలో ఉండగా ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. విమాన సిబ్బంది తక్షణ వైద్య సహాయం అందించారు.

మెడికల్‌ ఎమర్జెన్సీ నేపథ్యంలో అనారోగ్యంతో ఉన్న ప్రయాణికుడి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ విమాన కెప్టెన్ నిర్ణయం తీసుకున్నారు. ఆ విమానాన్ని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు మళ్లించారు. విమానం ఎయిర్‌పోర్ట్ లో ల్యాండ్‌ కాగానే ఆ ప్రయాణికుడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ దీనికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. ‘విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా, ఫ్లైట్ 6ఈ-178ను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు మళ్లించాం’ అని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ పైలట్‌ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్‌ 2న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Latest News

More Articles