Thursday, May 2, 2024

కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాక.. ఇతర పథకాలు ఇవ్వాలి

spot_img

నిజామాబాద్:  ప్రజా పాలన దరఖాస్తులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. మొదటగా కొత్త రేషన్ కార్డు మంజూరు చేసిన తర్వాత ఇతర పథకాలు ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 44 లక్షల మంది లబ్ధిదారులకు యధావిధిగా 4 వేల పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పెన్షన్ల కోసం మళ్లీ కొత్త దరఖాస్తులు, క్యూలైన్లు అవసరమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటికీ చాలామంది రైతులకు రైతుబంధు రాలేదని చర్చిస్తున్నారు. ప్రజా పాలన దరఖాస్తులు నిరుద్యోగ భృతి గురించి ఎందుకు చెప్పలేదని నిలదీశారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు జనవరి ఒకటి నుంచి 200 లోపు యూనిట్లు వాడే కరెంటుకు బిల్లు కట్టన అవసరం లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కు మధ్య రెండు శాతం ఓట్లు మాత్రమే తేడా ఉందని గుర్తుచేశారు. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని కవిత అన్నారు.

Latest News

More Articles